
టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక అనూహ్యంగా దాదాపు మూడేళ్ల పాటు ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. పలు కారణాలతో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతానంటుంది ఈ భామ. ఇటీవలె ఆమె నటించిన తిమ్మరుసు చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలను ప్రియాంక షేర్ చేసుకుంది.
టాక్సీవాలా చిత్రం అనంతరం నా జీవితంలో రకరకాల మార్పులు చోటుచేసుకున్నాయని, థైరాయిడ్ సమస్యతో విపరీతంగా బరువు పెరిగినట్లు పేర్కొంది. దీనికి తోడు హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో నా ముఖం మొత్తం మొటిమలు వచ్చేశాయి. అది చూసి చాలా భయపడ్డాను. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకోగా నాకున్న సమస్యలు అన్ని బయటపడ్డాయి. కానీ డాక్టర్ సలహాతో లైఫ్ స్టైల్‌ని మొత్తం మార్చుకున్నాను. యోగా, వ్యాయామాలతో పాటు ప్రత్యేక డైట్ తీసుకునేదాన్ని. ఇంట్లోనే రకరకాల కసరత్తులు చేసిన మళ్లీ ఫిట్‌గా మారిపోయాను.
ఆ మధ్య ఓసారి కాలేజీ రోజుల్లో నేను బాగా చబ్బీగా ఉన్న ఓ ఫోటో బయటకు వచ్చింది. మొహం అంతా మొటిమలతో, చబ్బీగా ఉన్న నన్నుచూసి విపరీతంగా ట్రోల్ చేశారు. లావుగా ఉండటం కూడా తప్పేనా అనిపించింది. నా ఆరోగ్య సమస్యల వల్ల బరువు పెరిగాను. ఏదైతేనెం మొత్తానికి ఇప్పుడు మళ్లీ ఫిట్‌గా మారిపోయా అని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం ప్రియాంక నటించిన తిమ్మరుసు, గమనం, ఎస్.ఆర్. కల్యాణమండపం చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దీనితో పాటు ఓ తమిళ సినిమాకు కూడా సైన్ చేసినట్లు ప్రియాంక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment