Hormonal imbalance
-
క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు..
వైద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. జీవితకాలాన్ని పొడిగించుకోగలిగిన మనిషి క్యాన్సర్‌కు ఆన్సర్ మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. క్యాన్సర్ అనగానే ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతుంటాయి. క్యాన్సర్‌పై అవగాహన కోసం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి... ► క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ లక్షణాలు ఆ వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి... తీవ్రమైన అలసట. జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత. ► క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? శరీరం మొత్తంలో క్యాన్సర్ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందని అనుమానిస్తే... దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ ఇలా.. అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రం పాప్‌స్మియర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. ► క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ లేదా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందుగా) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హెపటైటిస్–బి వ్యాక్సిన్ ద్వారా 50% – 60% కాలేయ క్యాన్సర్లను నివారించవచ్చు. ► క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదా? సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పుష్కలంగా పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా చూసుకోవడం ద్వారా వీలైనంతవరకు క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. ► క్యాన్సర్స్ వంశపారంపర్యమా? ఖచ్చితంగా చెప్పలేం గానీ... రక్తసంబంధీకుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్నప్పుడు... మిగతా వారితో పోలిస్తే... వీళ్లకువచ్చే ముప్పు ఎక్కువ. బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 వంటి జీన్ మ్యూటేషన్ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. ► క్యాన్సర్‌ను కొంతమంది జయిస్తే మరికొందరు కొద్దిరోజుల్లోనే మరణిస్తారు. ఎందుకని? ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే, క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడం అన్న విషయం దాన్ని ఏ దశలో కనుక్కున్నాం, ఆ క్యాన్సర్ గడ్డకు త్వరగా పాకే గుణం ఉందా లేక సోకిన ప్రాంతానికే పరిమితమయ్యిందా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, చికిత్సప్రక్రియలూ ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడంలో త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ తాలూకు స్టేజ్, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. ► క్యాన్సర్‌కు వయోభేదం లేదా? లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. ► క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? క్యాన్సర్ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) పరిశోధకులు కొంతవరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే వైద్యకేంద్రంలోని అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ–హోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్ అదుపులో ఉందంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి. -
ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్
ప్రస్తుతం తాను పలు శారీరక సమ్యలతో బాధపడుతున్నానని స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపింది. ఈ మేరకు ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘శారీరకంగా చాలా వీక్‌గా ఉన్నాను.. కానీ మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉన్నాను’ అని పేర్కొంది. ఈ సందర్భంగా తాను పలు హార్మోన్ల సమస్యతో బాధపడుతున్నానంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు శ్రుతి హాసన్ ఇలా రాసుకొచ్చింది. ‘ప్రస్తుతం నేను కొన్ని చెత్త హార్మోన్ల(Pcos endomestriosis) సమస్యల్ని ఎందుర్కొంటున్నా. వీటి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నా. హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ప్రతి మహిళకు తెలుసు. చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి ఇది మహిళల మెటబోలిక్పై ప్రభావం చూపుతుంది. అయితే నేను దీని గురించి చింతించకుండా సాధారణంగానే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందు కోసం సమయానికి తినడం, సరిపడ నిద్రపోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయమం చేస్తున్నా. ఇలా చేయడం వల్ల మానసికంగా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అందరు ఇలాంటి సమస్యలను బయటకు చెప్పేందుకు సంకోచిస్తుంటారు.. కానీ ఇలాంటి సవాళ్లను మనం ధైర్యంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇవి మన జీవితాన్ని డిఫైన్ చేయకూడదు. అందుకే నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకున్నా’ అంటూ శ్రుతి రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ మూవీతో పాటు బాలకృష్ణ ఎన్బీకే107 చిత్రంలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
40లో ప్రెగ్నెన్సీ..సుమారు 105కేజీల బరువు పెరిగాను : నటి
ప్రెగ్నెన్సీ టైంలో హర్మోన్స్ ఇంబ్యాలెన్స్‌తో మహిళల్లో అనేక శరీర మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో ఆందోళన చెందడం, బరువు పెరగడం చాలామంది మహిళల్లో సహజంగా జరిగేవే. కానీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి వాళ్లకు సంబంధించిన ప్రతీ అంశం సెన్సేషన్ అయిపోతుంది. వాళ్లు బరువు పెరిగినా, తగ్గినా ప్రేక్షకుల నుంచి సరిగ్గా రిసీవింగ్ ఉండదు. మరీ ఆంటీలా కనిపిస్తున్నావంటూ చెడామడా ట్రోల్స్ చేసేస్తుంటారు. నటి సమీరా రెడ్డి సైతం ఇలాంటి అబ్యూసివ్ మెసేజెస్, ట్రోల్స్ ఎదుర్కొన్నారు. తాజాగా తాను గర్భవతిగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న శరీరమార్పులు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై నటి సమీరా రెడ్డి స్పందించారు. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) 'బిడ్డకు జన్మనివ్వడం అన్నది చాలా గొప్పవిషయం. ఆ మధుర క్షణాలన్నింటిని ఆస్వాదించండి. శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం సహజమే. బరువు పెరగడంతో ఒత్తిడికి లోనవుతుంటారు చాలామంది. నా విషయంలోనూ ఇలాంటివి జరిగాయి. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అవడంతో భయపడ్డాను. హన్ష్ పుట్టిన తర్వాత నేను దాదాపు 105కేజీల బరువు పెరిగాను. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రోల్ చేసేవాళ్లు. బాడీ షేమింగ్ చేసేవాళ్లు. దీంతో తెలీకుండానే ఒకింత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కానీ నేను ఇలా ఎందుకు బాధపడుతున్నానా అనిపించింది. మెల్లిమెల్లిగా దాన్నుంచి బయటపడ్డాను. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) ఇక రెండోసారి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. హన్ష్ డెలీవరీ టైంలో మిస్ చేసుకున్న చిన్నిచిన్ని ఆనందాలను కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. నైరా పుట్టడానికి ఒకరోజు ముందు ఆ షూట్ చేశాం. అలా బిగ్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉండటం ఎంత సంతోషాన్ని ఇచ్చిందో చెప్పలేదు. ఇక నైరా పొట్టలో ఉన్నప్పుడు 8వ నెలలో బేబీ బంప్‌తో అండర్ వాటర్ షూట్ చేశాం. అది చూసి చాలా మంది ఆడవాళ్లు..మీరు చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు.. మీలాగే ఉండాలనుకుంటున్నా' అంటూ నాకు మెసేజ్ చేసేవాళ్లు అని తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి వివరించింది. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
హాస్పిటల్‌కు వెళ్తే నాకున్న సమస్యలన్నీ బయటపడ్డాయి : హీరోయిన్
టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక అనూహ్యంగా దాదాపు మూడేళ్ల పాటు ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. పలు కారణాలతో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతానంటుంది ఈ భామ. ఇటీవలె ఆమె నటించిన తిమ్మరుసు చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలను ప్రియాంక షేర్ చేసుకుంది. టాక్సీవాలా చిత్రం అనంతరం నా జీవితంలో రకరకాల మార్పులు చోటుచేసుకున్నాయని, థైరాయిడ్ సమస్యతో విపరీతంగా బరువు పెరిగినట్లు పేర్కొంది. దీనికి తోడు హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో నా ముఖం మొత్తం మొటిమలు వచ్చేశాయి. అది చూసి చాలా భయపడ్డాను. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకోగా నాకున్న సమస్యలు అన్ని బయటపడ్డాయి. కానీ డాక్టర్ సలహాతో లైఫ్ స్టైల్‌ని మొత్తం మార్చుకున్నాను. యోగా, వ్యాయామాలతో పాటు ప్రత్యేక డైట్ తీసుకునేదాన్ని. ఇంట్లోనే రకరకాల కసరత్తులు చేసిన మళ్లీ ఫిట్‌గా మారిపోయాను. ఆ మధ్య ఓసారి కాలేజీ రోజుల్లో నేను బాగా చబ్బీగా ఉన్న ఓ ఫోటో బయటకు వచ్చింది. మొహం అంతా మొటిమలతో, చబ్బీగా ఉన్న నన్నుచూసి విపరీతంగా ట్రోల్ చేశారు. లావుగా ఉండటం కూడా తప్పేనా అనిపించింది. నా ఆరోగ్య సమస్యల వల్ల బరువు పెరిగాను. ఏదైతేనెం మొత్తానికి ఇప్పుడు మళ్లీ ఫిట్‌గా మారిపోయా అని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం ప్రియాంక నటించిన తిమ్మరుసు, గమనం, ఎస్.ఆర్. కల్యాణమండపం చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దీనితో పాటు ఓ తమిళ సినిమాకు కూడా సైన్ చేసినట్లు ప్రియాంక వెల్లడించింది. -
మహిళల్లో మెనోపాజ్ సమస్యలు
మారుతున్న జీవన శైలితో నగర మహిళలు విభిన్న రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే క్రమంలో చిన్న వయసులోనే మెనోపాజ్ బారిన పడేలా చేస్తోంది. కరోనా, లాక్డౌన్ వంటి అనూహ్య పరిస్థితులు మహిళల్ని ముఖ్యంగా ఉద్యోగినులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ అనారోగ్య సమస్యల్ని సృష్టిస్తున్నాయి. అలాగే ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అవకాశాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మెనోపాజ్‌పై తగినంత అవగాహన అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నేడు వరల్డ్ మెనోపాజ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో : పన్నెండు నెలల పాటు పూర్తిగా పీరియడ్స్ రాకుండా ఉండడాన్నే మెనోపాజ్ అంటారు. మన దేశంలో 46 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వరకు ఈ దశ ఉంటుంది. 40 ఏళ్ల కన్నా ముందే పీరియడ్స్ రావడం ఆగిపోతే అది ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అంటారు. ఇది సహజంగా ఉండొచ్చు లేదంటే సర్జరీ ద్వారా అంటే యుట్రస్, ఓవరీస్ తీసేసినవారిలో ఈ సమస్య తలెత్తవచ్చు. ఎందుకిలా..? ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే వరుసగా నాలుగు నెలల పాటు పీరియడ్స్ రాకుండా ఉండటం. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లు అంటే థైరాయిడ్, జన్యుపరమైనవి, క్రోమోజోమ్‌లలో అపసవ్యత ఉన్నా ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ వస్తుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవారికి పీరియడ్స్ ఆగిపోతే వారికి వైద్యుల కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. కుటుంబ మద్ధతు అవసరం. మెనోపాజ్ లక్షణాలు.. ఒంట్లో నుంచి వేడి సెగలు రావడం, గుండె దడగా అనిపించడం, రాత్రి పూట చమటలు పట్టడం, ఎక్కువసార్లు యూరిన్కెళ్లడం, మూత్రనాళం ఇన్ఫెక్షన్, ఎముకలు పట్టేయడం లేదా బలహీనం కావడం అవుతుంటాయి. మానసిక సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, లైంగిక సమస్యలు, ఆత్మన్యూనతా భావం వంటివి తలెత్తుంటాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే.. జీవనశైలి మార్చుకోవాలి. రోజూ గంటసేపు తప్పనిసరి వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. పొగతాగడం అలవాటు ఉన్నవారు దీన్ని మానేయాలి. క్యాల్షియం, విటమిన్- డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆహారం ద్వారా తీసుకున్నా మేలు కలుగుతుంది. సరైన ఎండ కూడా మేనుకి తగిలేలా చూసుకోవాలి. వదులు దుస్తులు వేసుకోవాలి. చల్లటి వాతావరణంలో ఉండటం, మసాలా వంటకాలు తగ్గించాలి. మెనోపాజ్ వయసులో ఎముకల పటుత్వం పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. వీరికి ఎముక భాగంలో, తుంటి భాగంలో ప్రాక్చరర్స్ ఎక్కువ అవుతుంటాయి. రిస్క్ తగ్గించుకోవాలంటే హార్మోన్ థెరపీ అవసరమవుతుంది. మెనోపాజ్‌లో హ్యాపీగా.. డిప్రెషన్ వంటి ఛాయలు ఈ దశలో సాధారణంగా ఎదుర్కోవాల్సిఉంటుంది. అందుకని కుటుంబంతో ఆనందంగా గడపాలి. స్నేహితులతో ఉల్లాసపు క్షణాలను వెతుక్కోవాలి. నచ్చిన హాబీని కొనసాగించాలి. ఒంటరిగా ఉండకుండా ఎవరికి వాళ్లు తీరకలేని వ్యాపకాన్ని ఎంచుకోవాలి. తోటపని చేయడం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవడం వంటివీ చేయొచ్చు. మానసిక ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీదా దృష్టి పెట్టాలి. మెనోపాజ్ దశలో ఉన్నవాళ్లు ప్రతి ఏడాది వైద్యుల సలహా తీసుకుంటే రాబోయే సమస్యలను ముందే నివారించవచ్చు. -డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, ముషీరాబాద్ -
ఆ మహిళలకు రెడ్‌వైన్ భలే మందట
పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) తో బాధపడే మహిళలకు రెడ్ వైన్ దివ్య ఔషధంలా పనిచేస్తుందని తాజా అధ్యయనం తేల్చింది.రెడ్ వైన్, ద్రాక్ష లలో ఉండే ఒక సహజ సమ్మేళనం హార్మోన్ అసమతుల్యత తో ఇబ్బందులుపడే స్త్రీలకు సహాయపడుతుందని తేల్చారు..సాధారణంగా గింజల్లో (నట్స్) కనిపించే, వ్యాధులనుంచి గుండెను కాపాడే యాంటీ ఆక్సిడెంట్... రెస్వెట్రాల్ సప్లిమెంట్ ను రెడ్ వైన్ లో కనుగొన్నట్టు తెలిపారు. ఈ అధ్యయనాన్ని ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ 'క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం' లో ప్రచురించింది. వైద్యశాస్త్రం ప్రకారం పురుషుల్లో ఎక్కువగా, మహిళల్లో తక్కువగాను ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిఎక్కువ మోతాదులో మహిళల్లో ఉత్పత్తికావడం మూలంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వంధ్యత్వం, బరువు పెరగడం. మొటిమలు, అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్, లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఈ పునరుత్పత్తి హార్మోను టెస్టోస్టెరాన్ మహిళల్లో మధుమేహ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాలిఫోర్నియా, శాన్ డియాగో, విశ్వవిద్యాలయ పరిశోధకులు రెడ్ వైన్ లోని (వేరుశెనగ, బ్లాక్ బెర్రీస్ , చాక్లెట్లలో లభించే) రెస్వెట్రాల్ అనే పాలీఫినాల్ తో 30 మంది మహిళలపై మూడు నెలలపాటు పరిశోధించారు. ఈ క్రమంలో వారిలోని హార్మోన్ స్థాయిలు సరి చేయగలిగినట్టు చెప్పారు. దాదాపు 23.1 శాతం టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినట్టు గుర్తించారు. రెస్వెట్రాల్.. ఇన్సులిన్ నియంత్రణకు , మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందనీ, శరీరం యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుందని తమ పరిశోధనలో తేలిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఎండీ, సీనియర్ రచయిత, అంటోని జె డ్యూలెబా ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పీసీఎస్ తో భాధపడుతున్న స్త్రీలలో మెటబాలిజ సమస్యలను తగ్గించేందుకు సహాయం చేస్తుందన్నారు. -
ఆరోగ్యం జాగ్రత్త!
ఎగ్జామ్ టిప్స్ టెన్షన్‌గా ఉండటం, నిద్ర తక్కువగా పోవడం వల్ల కడుపులో ఎక్కువ ఆమ్లాలు విడుదలవుతుంటాయి. అందుకని పరీక్షలు ఉన్నన్ని రోజులు పిల్లలకు పులుపు, కారాలు ఎక్కువ ఉన్న పదార్థాలను పెట్టకూడదు. ఇవి కడుపుబ్బరాన్ని, నొప్పిని కలిగిస్తాయి. రెండు, రెండున్నర గంటలకోసారి తగు మోతాదులో సమతుల ఆహారాన్ని ఇవ్వడం వల్ల సమస్యలను దరిచేరకుండా చూడవచ్చు.అమ్మాయిలకు రుతుక్రమ సమస్యలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యం, ఎదిగే వయసులో రుతుక్రమం సమయంలో కడుపునొప్పి, తల తిరగడం, జ్వరంగా అనిపించడం జరుగుతుంటాయి. అందుకని రుతుక్రమం మొదలవడానికి ముందురోజే పారసిటమాల్ వేయచ్చు. తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. వీరికి ద్రవపదార్థాలు కూడా ఎక్కువ ఇవ్వాలి. కొంతమందికి కొన్ని ఆహారపదార్థాలు పడవు. పిల్లలకు ఏ పదార్థాలు పడవో వాటిని పెట్టకూడదు. అలాగే నిల్వ ఉన్న పదార్థాలు, చికెన్, మటన్‌లాంటి త్వరగా జీర్ణం కాని పదార్థాలకు ఈ సీజన్లో దూరంగా ఉండటం మంచిది. విరేచనాలు అవుతుంటే అరటిపండు, వైట్బ్రెడ్, మజ్జిగ, మెత్తగా ఉడికించిన అన్నం రెండు రోజుల పాటు ఇస్తే సరిపోతుంది. పరీక్షల భయం రకరకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. వాటికి ‘సొంతవైద్యం’ పేరుతో తోచిన మందులు వాడకుండా, భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి. పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత మనోధైర్యాన్ని కుటుంబం ఇస్తే పిల్లలు విజయంతో తిరిగొస్తారు.మధ్యాహ్నం వరకు ఆకలికి ఆగాలని ఎక్కువ మొత్తంలో అల్పాహారాన్ని కడుపులో పడేయకూడదు. వేపుళ్లు, అధికమొత్తంలో పీచు, పిండి పదార్థాలను పరీక్షకు వెళ్లే ముందు తీసుకోకూడదు. అప్పుడప్పుడు పెప్పర్మింట్స్ చప్పరిస్తుంటే టెన్షన్ నుంచి రిలాక్స్ అవుతారు.