
ప్రస్తుతం తాను పలు శారీరక సమ్యలతో బాధపడుతున్నానని స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపింది. ఈ మేరకు ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘శారీరకంగా చాలా వీక్‌గా ఉన్నాను.. కానీ మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉన్నాను’ అని పేర్కొంది. ఈ సందర్భంగా తాను పలు హార్మోన‍్ల సమస్యతో బాధపడుతున్నానంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు శ్రుతి హాసన్ ఇలా రాసుకొచ్చింది. ‘ప్రస్తుతం నేను కొన్ని చెత్త హార్మోన్ల(Pcos endomestriosis) సమస్యల్ని ఎందుర్కొంటున్నా. వీటి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నా. హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ప్రతి మహిళకు తెలుసు.
చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి
ఇది మహిళల మెటబోలిక్‌పై ప్రభావం చూపుతుంది. అయితే నేను దీని గురించి చింతించకుండా సాధారణంగానే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందు కోసం సమయానికి తినడం, సరిపడ నిద్రపోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయమం చేస్తున్నా. ఇలా చేయడం వల్ల మానసికంగా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అందరు ఇలాంటి సమస్యలను బయటకు చెప్పేందుకు సంకోచిస్తుంటారు.. కానీ ఇలాంటి సవాళ్లను మనం ధైర్యంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇవి మన జీవితాన్ని డిఫైన్ చేయకూడదు. అందుకే నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకున్నా’ అంటూ శ్రుతి రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ మూవీతో పాటు బాలకృష్ణ ఎన్‌బీకే107 చిత్రంలో నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment