టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే! మొన్నామధ్య ప్రియాంక తన ఎదురుగా కూర్చున్న వ్యక్తిని కనిపించీ కనిపించనీయకుండా ఫొటో తీసి నెట్టింట షేర్ చేసింది. అంతేకాదు ఆ పోస్ట్‌కు అతడే.. అంటూ హార్ట్ ఎమోజీ షేర్ చేయడంతో నెట్టింట దుమారం చెలరేగింది. అతడు మరెవరో కాదు ఆటగాడు వెంకటేశ్ అయ్యరే అంటూ పలువురూ కామెంట్లు చేశారు. ఇక ఈ ఫొటో వైరల్ కావడంతో ప్రియాంక మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ తనపై వస్తున్న పుకార్లపై స్పందించింది.
మరోసారి ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి ఫొటో మాకు ఓ పనిలో సాయం చేయడానికి వచ్చాడు. బాయ్‌ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తుండటంతో ఏంటి సంగతని మా అమ్మ అడుగుతోంది. దయచేసి అలాంటివి రాయడం ఇంక ఆపేయండి అని సూచించింది.
చదవండి: ఉరివేసుకుని నటుడి ఆత్మహత్య.. కారణం ఏంటంటే ?
ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?!
Comments
Please login to add a commentAdd a comment