టాలీవుడ్‌ హీరోయిన్‌, ఈ యంగ్‌ క్రికెటర్‌ మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌? | Is Cricketer Venkatesh Iyer Actress Priyanka Jawalkar In a Relation | Sakshi
Sakshi News home page

Priyanka Jawalkar: టాలీవుడ్‌ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్‌ క్రికెటర్‌!

Published Sun, Apr 3 2022 8:49 PM | Last Updated on Sun, Apr 3 2022 9:36 PM

Is Cricketer Venkatesh Iyer Actress Priyanka Jawalkar In a Relation - Sakshi

ఓ యంగ్‌ క్రికెటర్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌పై మనసు పారేసుకున్నాడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకి వారెవంటే టాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్‌ యంగ్‌ క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ నడుస్తోందంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ దర్శనమిస్తున్నాయి. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఉగాది సందర్భంగా ప్రియాంక షేర్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు వెంకటేశ్‌ అయ్యర్‌ కామెంట్‌ చేశాడు. దీనికి ప్రియాంక ఇచ్చిన రిప్లై చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: రామ్‌ చరణ్‌ గొప్ప మనసు, ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఒక్కొక్కరికి తులం బంగారం..

కాగా ప్రియాంక జవాల్కర్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన గ్లామరస్‌, హాట్‌లుక్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తు ఉంటుంది. ఈ క్రమంలో ఉగాది సందర్భంగా ఆమె తన ఫొటోలను షేర్‌ చేస్తూ ‘బూ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రియాంక ఈ ఫొటోలో క్రీమ్‌ కలర్‌ షోల్డర్‌ కట్‌ టాప్‌ ధరించి కర్టన్‌ వెనకాల కుర్చోని ఉంది. ఈ ఫొటోకి వెంకటేశ్‌ అయ్యర్‌ క్యూట్‌ అంటూ కామెంట్‌ చేశాడు. అతడి కామెంట్‌కు ప్రియాంక హు? యూ? అంటూ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

చదవండి: బంజారాహిల్స్‌ రేవ్‌ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్‌ సిప్లిగంజ్‌

‘మీ ఓవరాక్షన్‌ ఆపండి మాకు అంతా తెలుసు, మీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కూడా అవుతున్నారు’, ‘ఏంటి ఇది వెంకటేశ్‌ భయ్యా.. ఏం జరుగుతుంది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఆయన ఎవరో తెలియదా ఇండియన్‌ క్రికెటర్‌, నెక్ట్‌ జనరేషన్‌కు కాబోయే క్రికెట్‌ సూపర్‌ స్టార్‌’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే మరికొందరూ ప్రియాంక వెంకటేశ్‌ అయ్యర్‌ని క్యూట్‌ అంటుందంటూ స్పందిస్తున్నారు. చూస్తుంటే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రియాంకా జవాల్కర్‌ విజయ్‌ దేవరకొండతో టాక్సివాలా మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement