Dry Fruits Health Benefits In Telugu - Here's How Much You Should Eat Dry Fruits - Sakshi
Sakshi News home page

Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారా? జర జాగ్రత్త!

Published Sat, May 14 2022 9:02 AM | Last Updated on Sat, May 14 2022 12:58 PM

Dry Fruits Benefits And Reasons For Health Issues If-Eat More - Sakshi

డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్‌ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్‌ ఒక ఆప్షన్‌. అయితే ఇవి రుచిగా ఉంటాయి కదా... ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్‌ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్‌ తినడం వల్ల కలిగే లాభాలేంటి..? అనే విషయాలను తెలుసుకుందాం...

డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్‌ తినే విధానం, ఏ నట్స్‌ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు చూద్దాం..

బాదం
బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్‌ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్‌లో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పు తినడం వల్ల వీటిని నుంచి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

వాల్‌ నట్స్‌
వాల్‌ నట్స్‌ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్‌ యాసిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్‌ ఈ స్కిన్‌లోనే ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు.

కర్జూరం 
ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్‌ ఇందులో రిచ్‌గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది.

పిస్తా
పిస్తా వెల్‌నెస్‌ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్‌ లో కంటే ప్రొటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

జీడిపప్పు 
కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్‌ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎండుద్రాక్ష
తియ తియ్యగా పుల్లపుల్లగా ఉండే ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్‌ బి, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. 50 ఎండుద్రాక్షలు తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement