
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ గురువారం మధ్యాహ్నం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెబుతూ.. గబ్బర్ సింగ్ షూటింగ్‌లో వెన్నుమొకకు తగిలిన గాయం మళ్లీ ఎక్కువ అయినట్లు తెలిపారు.
ఈ కారణంగానే విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని అన్నారు. మీడియా స్వేచ్చ కోసం చేస్తున్న ఈ పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. అయితే తనకు తలెత్తిన ఈ సమస్యకు వైద్యం తీసుకుంటున్నందున మూడు రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పేర్కొన్నారు.
JanaSena Chief @PawanKalyan pic.twitter.com/uDfS20R41f
— JanaSena Party (@JanaSenaParty) September 26, 2019
Comments
Please login to add a commentAdd a comment