పుష్కరాలకు రూ. కోట్లు వృథా
Published Thu, Aug 18 2016 8:39 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున
కొల్లూరు: పుష్కరాల పనుల్లో ప్రభుత్వం రూ. కోట్లు వృథా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం కొల్లూరు మండలంలోని పోతార్లంకలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన పుష్కర స్నానమాచరించి పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గ పరిధిలో నిర్మించిన 12 పుష్కర ఘాట్లలో రెండు మూడు మినహా మిగిలిన ఘాట్లు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి అభివృద్ధిని విస్మరించడం హేయమని ధ్వజమెత్తారు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ వేల కోట్లు స్వాహా చేయడం బాధాకరమన్నారు. ప్రణాళికేతర వ్యయం కారణంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.80 వేలSకోట్లు అప్పులు చేసిందని గుర్తుచేశారు. పుష్కర పనుల్లో వందల కోట్లు అవినీతి జరిగిందని ప్రభుత్వ అవినీతిపై సరైన విచారణ జరిపితే టీడీపీ ప్రభుత్వంలోని అవినీతి పరుల జాబితా బయటకి వస్తుందన్నారు. ఆయన వెంట కొల్లూరు ఉప సర్పంచి కఠెవరపు జేసుదాసు, దుగ్గిరాల మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్ బిట్రగుంట సత్యనారాయణ, మండల ఎస్సీ సెల్ ప్రదాన కార్యదర్శి కాలం రాజేంద్ర, స్థానిక నాయకులు పరిశ రంగారావు తదితరులున్నారు.
Advertisement
Advertisement