Rs. Crores
-
ఫ్యాన్సీ నెంబర్లపై రూ. 3.54 కోట్ల ఆదాయం
గుంటూరు (నగరంపాలెం) : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 5878 వివిధ ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా జిల్లా రవాణా శాఖకు రూ. 3,54,64,400 ఆదాయం సమకూరిందని జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఆర్టీఏ కార్యాలయంలో 3702 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.2,41,00,00, నర్సరావుపేట ఆర్టీఏ కార్యాలయంలో 1169 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.55,50,00, పిడుగురాళ్ళ ఎంవీఐ కార్యాలయంలో 351 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.22,18,00 , తెనాలి ఎంవీఐ కార్యాలయంలో 656 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.34,70,000 ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది ఇదే కాలానికి 5474 ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా రూ.3.04 కోట్ల ఆదాయం సమాకూరితే ఈ ఏడాది రూ.50 లక్షలు అదనంగా ఆదాయం సమకూరిందన్నారు. -
ఖనిజం అక్రమ రవాణా
ఆలస్యంగా వెలుగుచూసిన అక్రమార్కుల దోపిడీ బొల్లాపల్లి: ముడి ఖనిజం అక్రమ తరలింపు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్లవిలువ జేసే లెడ్ జింక్ ముడి సరుకు అక్రమ రవాణాకు అక్రమార్కులు నడుం బిగించారు. పాలకపార్టీ నాయకుల అండదండలతో స్థానిక నాయకులు ఈ అక్రమ దోపిడీకి శ్రీకారం చుట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో బండ్లమోటు మైనింగ్ 1965లో ప్రారంభమైంది. అనంతరం నష్టాబాటలో ఉన్న కంపెనీ 2002లో మూతపడింది. అప్పట్లో కొన్ని వేల టన్నులు ముడి సరుకు మైనింగ్ పక్కనే పడిఉంది. వేల కోట్ల విలువచేసే ఈ రాయి అక్రమ రవాణాపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. 2013తో మైనింగ్ లీజ్ రద్దవడంతో ఈ ప్రాంతమంతా అటవీ శాఖ అదీనంలోకి వచ్చింది. టిడిపి అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఈ ప్రాంతానికి కొందరు వచ్చి పరిశీలించి వెళ్తున్నారని స్థానికులు అంటున్నారు. గత రెండు నెలలుగా క్వారీ ప్రాంతం నుంచి రెండు ధపాలుగా ముడి సరుకు అక్రమంగా తరలివెళ్లిందని, ఈ సరుకు అక్రమ తరలింపు అటవీ శాఖాధికారుల కనుసన్నల్లో జరిగిందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. టిప్పర్లను అడ్డుకున్న యువకులు.. గురువారం తెల్లవారుజామున ఆరు టిప్పర్లు, పెద్ద ప్రోక్లెయినర్ బండ్లమోటు మైనింగ్‌లోకి ప్రవేశించి అక్రమంగా తరలిస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకులు గమనించి టిప్ఫర్లును అడ్డుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు సిబ్బంది సంఘటన ప్రాంతానికి చెరుకొని వాహనాల వివరాలు సేకరించారు. నిబందనల ప్రకారం అర్ధరాత్రివేళ అటవీ సంపదను కొల్లగొడుతున్న వాహనాలను సీజ్ చేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో వాహనాలు సంఘటన ప్రాంతం నుంచి వెళ్లిపోవడం, పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమంగా తరలించిన ముడిసరుకు పక్కనే ఉన్న రేమిడిచర్ల గ్రామానికి సమీపంలోని దంతెలకుంట పోలాల్లో నిలువచేశారు. సుమారు వంద టన్నుల ముడిసరుకు అక్రమంగా తరలివెళ్లినట్లు తెలుస్తుంది. టన్ను ముడి సరుకు విలువ సుమారు లక్షన్నర వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు. స్థానిక యువకులు అడ్డగించడంతో ఈవిషయం వెలుగుచూసింది. మూసివేసిన మైనింగ్ నుంచి సరుకు రవాణాకు దట్టంగా మెలచిన అటవీ ప్రాంతంలోని కలపను నరికివేసి దారి ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ తరలింపు వెనుక పెద్దల హస్తం..? ఉన్నత స్థాయి పాలనా యంత్రాంగం అండదండలతో అక్రమంగా తరలివెళ్తోందని, ముడిసరుకును కడప జిల్లాకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు వాపోతున్నారు. కోట్ల అటవీ సంపదను అక్రమార్కుల నుంచి కాపాడాలని బండ్లమోటు గ్రామస్తులు కోరుతున్నారు. -
పుష్కరాలకు రూ. కోట్లు వృథా
వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున కొల్లూరు: పుష్కరాల పనుల్లో ప్రభుత్వం రూ. కోట్లు వృథా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం కొల్లూరు మండలంలోని పోతార్లంకలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన పుష్కర స్నానమాచరించి పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గ పరిధిలో నిర్మించిన 12 పుష్కర ఘాట్లలో రెండు మూడు మినహా మిగిలిన ఘాట్లు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి అభివృద్ధిని విస్మరించడం హేయమని ధ్వజమెత్తారు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ వేల కోట్లు స్వాహా చేయడం బాధాకరమన్నారు. ప్రణాళికేతర వ్యయం కారణంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.80 వేలSకోట్లు అప్పులు చేసిందని గుర్తుచేశారు. పుష్కర పనుల్లో వందల కోట్లు అవినీతి జరిగిందని ప్రభుత్వ అవినీతిపై సరైన విచారణ జరిపితే టీడీపీ ప్రభుత్వంలోని అవినీతి పరుల జాబితా బయటకి వస్తుందన్నారు. ఆయన వెంట కొల్లూరు ఉప సర్పంచి కఠెవరపు జేసుదాసు, దుగ్గిరాల మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్ బిట్రగుంట సత్యనారాయణ, మండల ఎస్సీ సెల్ ప్రదాన కార్యదర్శి కాలం రాజేంద్ర, స్థానిక నాయకులు పరిశ రంగారావు తదితరులున్నారు. -
రూ.కోట్లు కొట్టుకుపోతున్నాయ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : నాగార్జున సాగర్ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత గాల్లోదీపంగా మారింది. పదికాలాలపాటు మన్నికగా ఉండాల్సిన రహదారి నిర్మాణం.. చిన్న వానకే చెదిరిపోతోంది. బొంగ్లూర్ ఔటర్ రింగురోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వరకున్న నాగార్జునసాగర్ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.29 కోట్లతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు 7.6 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గతేడాది మార్చిలో పనులు మొదలయ్యాయి. ఇందులో కీలకమైన ఇబ్రహీంపట్నం చెరువుకట్ట, మంగల్‌పల్లి వంతెన పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. అయితే ఈ పనుల్లో నాణ్యత మాయమవ్వడంతో భారీగా నిధులు వెచ్చించి చేపడుతున్న పనులు అస్తవ్యస్తమవుతున్నాయి. చెదిరి ‘చెరువు’లోకి.. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టను నాలుగు లైన్లుగా మార్చేందుకు కొంత భాగాన్ని కట్టకు సమానంగా చేస్తూ.. మరికొంత భాగం కట్ట కింద రోడ్డు వేస్తున్నారు. అయితే కట్టకు సమానంగా చేసే క్రమంలో దాదాపు 40 అడుగుల ఎత్తులో మట్టి వేసి చదును చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే గతవారం చివర్లో కురిసిన వర్షానికి ఈ మట్టి కాస్త కిందికి కొట్టుకుపోతోంది. వాస్తవానికి అంత ఎత్తులో కేవలం మట్టితోనే రోడ్డు నిర్మిస్తే ఎక్కువ కాలం మన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా రోడ్డు ఎత్తు పెంచే క్రమంలో ఇక్కడ కొంత భాగం మట్టితో.. ఆ తర్వాత మెటల్‌తో నింపి మరికొంత భాగాన్ని మట్టి వేసి నిర్మిస్తారు. కానీ ఇక్కడ మొత్తం మట్టినే నింపుతూ పనులు పూర్తిచేస్తున్నారు. దీంతో గత వారం ఒక్కసారిగా కురిసిన వానకు మట్టంతా చెదిరి చెరువులోకి చేరింది. ప్రస్తుతం నీరులే కపోవడంతో పనులు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. చెరువులోకి నీరు చేరితే.. అలల తాకిడికి మట్టి కొట్టుకొచ్చే అవకాశం ఎక్కువ. ఇదిలాఉంటే రోడ్డు విస్తరణ పనుల్లో లోపాలు లేకుండా పక్కాగా నిర్మాణం పూర్తి చేస్తామని రహదారులు, భవనాల శాఖ సహాయ ఇంజినీరు వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు.