ఫ్యాన్సీ నెంబర్లపై రూ. 3.54 కోట్ల ఆదాయం
గుంటూరు (నగరంపాలెం) : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 5878 వివిధ ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా జిల్లా రవాణా శాఖకు రూ. 3,54,64,400 ఆదాయం సమకూరిందని జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఆర్‌టీఏ కార్యాలయంలో 3702 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.2,41,00,00, నర్సరావుపేట ఆర్‌టీఏ కార్యాలయంలో 1169 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.55,50,00, పిడుగురాళ్ళ ఎంవీఐ కార్యాలయంలో 351 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.22,18,00 , తెనాలి ఎంవీఐ కార్యాలయంలో 656 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.34,70,000 ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది ఇదే కాలానికి 5474 ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా రూ.3.04 కోట్ల ఆదాయం సమాకూరితే ఈ ఏడాది రూ.50 లక్షలు అదనంగా ఆదాయం సమకూరిందన్నారు.