vehicle number
-
ఓ స్క్రూ.. ఇలా కన్ఫ్యూజ్ చేసింది..!
సాక్షి, హైదరాబాద్: ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్‌నే’ మార్చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనంపై కాకుండా మరో వాహనంపై ఈ–చలాన్ జారీ అయ్యేలా చేసింది. దీంతో బాధితుడు సిటీ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. టీఎస్––5570 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన వాహనం నెంబర్ ప్లేట్‌పై మొదటి అంకె ‘5’ ముగింపులో స్క్రూను బిగించారు. దీంతో దూరం నుంచి చూసే వాళ్లకు ఇది ‘6’గా కనిపిస్తోంది. ఫలితంగా ఆ వాహనం నెంబర్ ‘6570’గా కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినపుడు ట్రాఫిక్ పోలీసులు తీసిన స్టిల్ కెమెరాల్లో ఈ నెంబర్ క్యాప్చర్ అయింది. ఆనెంబరు ‘6570’గా భావించి ఈ–చలాన్లు పంపుతూ వచ్చారు. దీంతో ఆ నెంబరుగల వాహన యజమాని.. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన వాహన నెంబర్ వినియోగిస్తున్నారని భావించారు. ఈ విషయాన్ని నగర ట్రాఫిక్ విభాగం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు ఆరా తీయగా ‘5570’ నెంబర్ గల వాహనం ఉల్లంఘనలకు పాల్పడిందని, అయితే నెంబర్ ప్లేట్ బిగించడానికి వాడిన స్క్రూ కారణంగా అది ‘6570’గా మారిందని గుర్తించారు. దీంతో పెండింగ్ చలాన్లను నిజంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనానికి విధించారు. -
వాహనం ఒకరిది.. నంబర్ ఇంకొకరిది
పై ఫొటోలో కనిపిస్తున్న ఆటో టేకులపల్లిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు ఫొటో తీసి, నంబర్ ఆధారంగా ఈ–చలాన్ పంపారు. కానీ అది ఖమ్మంలోని ఓ కారు ఓనర్‌కు వెళ్లింది. కారు నంబర్ ఆటోపై రాయడంతో ఈ మతలబు జరిగింది. భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి స్కూటీ ఎప్పుడూ ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. అయితే చండ్రుగొండలో హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఈ–చలాన్ వచ్చింది. ఫొటోలో మాత్రం ప్యాషన్ బైక్ ఉంది. జరిమానా స్కూటీ ఓనర్‌కు వచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు తప్పించుకునేందుకు కొందరు తమ వాహనాలపై ఇతరుల వాహనాల నంబర్లు రాసుకుంటున్నారు. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పోలీసులు నిబంధనలు ఉల్లంఘించేవారి వాహనాల ఫొటోలు తీస్తున్నారు. వాటి ఆధారంగా వాహనం నంబర్ గుర్తించి జరిమానా విధిస్తున్నారు. అయితే కొందరు ఉల్లంఘనులు ఇతరుల వాహనాల నంబర్లను తమ వాహనాలపై రాయించుకుంటున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ–చలాన్లు మాత్రం ఇతరులకు వెళ్తున్నాయి. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఒక వాహనం నంబరును మరో వాహనానికి చెందిన వ్యక్తులు ఉపయోగిస్తుండటంతో నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేరేవాళ్లు చేస్తున్న తప్పులకు తాము జరిమానా కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ వాహనాల నంబర్లు పెట్టుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం పోలీసులకు భారీ లక్ష్యాలు విధించి ఒత్తిడి చేస్తోంది. దీంతో రోజూ అన్ని ఠాణాల పరిధిలోని కానిస్టేబుళ్లు వివిధ కూడళ్లలో నిలబడి ఫొటోలు తీయడమే పనిగా ఉంటున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ సైతం గాలికి వదలాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు తనిఖీలు చేస్తేనే ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, వాహనం నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఏజెన్సీలోనే తనిఖీలు.. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల నేపథ్యంలో జిల్లాలోని భద్రాచలం, పినపాక ఏజెన్సీల్లో మాత్రమే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాదారులు పట్టుబడుతున్నారు. పోలీసులు పేలుడు పదార్థాలు, గంజాయి రవాణాపైనే దృష్టి పెడుతున్నారు తప్ప వాహనాలకు పత్రాలు ఉన్నాయా? లేవా? అనే విషయం పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో తనిఖీలు అంతగా చేపట్టడం లేదు. దీంతో ఏ వాహనంలో ఏం తరలిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనుల ఫొటోలను తీసేందుకే కానిస్టేబుళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ సమస్యలపై ఎస్పీ సునీల్‌దత్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. -
వాహనం నంబర్‌తో కేసు బుక్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినా, కొందరు కర్ఫ్యూ ఆంక్షలను పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త వ్యూ హం పన్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్ పీఆర్) సాంకేతికతతో రోడ్లపైకి వచ్చిన వాహనం నంబరు గుర్తిస్తున్నారు. దాని ఆధారంగా వారిపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం కేసులను నమోదు చేస్తున్నారు. ఈ సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఎలాంటి కారు నంబరునైనా, వాహనం ఎంత వేగంలో ఉన్నా సరే ఇది సులభంగా గుర్తిస్తుంది. వాహన యజమాని వివరాలు ప్రత్యక్షమవుతాయి. కేసుల్లో ఇరుక్కోవద్దు: లాక్డౌన్ నిబంధనల ప్ర కారం.. ప్రతీ వాహనం రెండు కి.మీ.లోపే పరిమి తం కావాలి. కానీ, పలువురు ఇష్టానుసారం ప్రయాణిస్తున్నారు. ఈ కెమెరాతో నంబరును గుర్తించి, వాహనదారుడి చిరునామాకు, అతను వాహనం కెమెరాకు చిక్కిన ప్రాంతానికి మధ్య దూరం చూసి కేసు నమోదు చేస్తారు. గంటల్లోనే సదరు వాహన యజమాని అరెస్టు అవుతారు. అన్ని జిల్లాల్లో ప్రతీ కెమెరాకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో సదరు వాహనం యజమానిపై ఐపీసీ 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడు తుందని హెచ్చరిస్తున్నారు. అకారణంగా ఇళ్ల నుం చి బయటికి వచ్చే వాహనదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఫ్యాన్సీ నెంబర్లపై రూ. 3.54 కోట్ల ఆదాయం
గుంటూరు (నగరంపాలెం) : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 5878 వివిధ ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా జిల్లా రవాణా శాఖకు రూ. 3,54,64,400 ఆదాయం సమకూరిందని జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఆర్టీఏ కార్యాలయంలో 3702 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.2,41,00,00, నర్సరావుపేట ఆర్టీఏ కార్యాలయంలో 1169 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.55,50,00, పిడుగురాళ్ళ ఎంవీఐ కార్యాలయంలో 351 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.22,18,00 , తెనాలి ఎంవీఐ కార్యాలయంలో 656 ఫ్యాన్సీ నెంబర్లకు రూ.34,70,000 ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది ఇదే కాలానికి 5474 ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా రూ.3.04 కోట్ల ఆదాయం సమాకూరితే ఈ ఏడాది రూ.50 లక్షలు అదనంగా ఆదాయం సమకూరిందన్నారు. -
ఏపీ స్థానంలో టీఎస్!
* నంబర్ల మార్పిడిపై ప్రాథమిక నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తాం * వాహనం నంబర్ మార్పు ఉండదు.. హైకోర్టుకు టీ సర్కారు నివేదన * విచారణ నాలుగు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పేరుతో ఉన్న వాహనాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం (టీఎస్) పేరుతో తిరిగి రిజిస్టర్ చేసుకోవాలన్న ఉత్తర్వులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నంబర్ల రీ అసైన్మెంట్ నిమిత్తం ఈ ఏడాది జూన్ 17న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సవరణలు చేయాలని నిర్ణయించామని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. నంబర్ మార్పు లేకుండా ఏపీ పేరు స్థానంలో టీఎస్ పేరు చేర్చుకునేలా సవరణలు తీసుకువస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అండపల్లి సంజీవ్‌కుమార్ కోర్టుకు తెలిపారు. సవరణల ప్రక్రియుకు నాలుగు వారాల గడువునివ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల నంబర్ల రీ అసైన్మెంట్ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జె.రామ్మోహన్‌చౌదరి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువూర్లు విచారణ జరిగింది. సోవువారం విచారణ ప్రారంభం కాగానే సంజీవ్‌కుమార్ నంబర్ల రీ అసైన్మెంట్ నిమిత్తం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌కు సవరణలు చేయాలని నిర్ణయించినట్టు కోర్టుకు నివేదించారు. తదనుగుణంగా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, తుది నిర్ణయం తీసుకుంటామని తెలి పారు. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ప్రాథమిక నోటిఫికేషన్‌కు సవరణలు చేసిన తరువాత వాటిని తమ ముందుంచాలని సంజీవ్‌కుమార్‌కు స్పష్టం చేశారు. నోటిఫికేషన్‌కు సవరణలు చేయడం ద్వారా నంబర్ల రీ అసైన్మెంట్ జీవో నంబర్ 3ను ఉపసంహరించుకుంటున్నారా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. జీవోను ఉపసంహరించుకోవడం లేదని, జీవో నంబర్ 3 కింద జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌కు సవరణలు చేయనున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న వాహనాలకు నంబర్‌తో నిమిత్తం లేకుండా ఏపీ పేరు స్థానంలో టీఎస్ చేర్చనున్నామని సంజీవ్ కుమార్ తెలిపారు.