సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ దీపావళి కానుక అందించింది. డీఏ 5శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాష్ జవదేకర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించే 12 శాతంనుంచి 17శాతానికి పెరిగింది. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయల భారం పడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు. పెంచిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నారు. దీంతో 50 లక్షలమంది ఉద్యోగులకు, 62 లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అంతేకాదు ఆశా వర్కర్కకు కేంద్రం అందించే భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు. ఇప్పటివరకు వెయ్యిరూపాయిలుగా ఉన్న ఈరెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ. 2 వేలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment