న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరువు భత్యం (డీఏ)ను 4శాతం పెంచే నిర్ణయానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించిం ది. దీనివల్ల 1.13 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దార్లకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన డీఏ 2020 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ 17 నుంచి 21శాతానికి చేరుకుంది. పెరిగిన రేట్లకు అనుగుణంగా దీన్ని పెంచినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక తెలిపింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. 12,510 కోట్లు, 2020–21 సంవత్సరానికి (2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు) రూ. 14,595 కోట్ల అదనపు భారం పడనుంది. దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్‌దారులు లబ్ధి పొందనున్నారని సమాచార, ప్రసార శాఖ మంత్రి జవడేకర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment