
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ 2 లక్షల కోట్ల విలువైన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలకు బుధవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశీ తయారీరంగాన్ని ప్రోత్సహించేందుకు పది రంగాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్టు కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.
ఫార్మా, ఆటో, స్టీల్, టెలికాం, జౌళి, ఆహోరోత్పత్తులు, సోలార్ ఫోటోవోల్టిక్, సెల్ బ్యాటరీ వంటి పది రంగాలకు వర్తింపచేసినట్టు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పథకాలకు మరింత ఊతమిస్తామని, వయబులిటి గ్యాప్ ఫండింగ్ కింద 8100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తెలిపారు. దేశీ తయారీరంగాన్ని అంతర్జాతీయ స్ధాయిలో దీటుగా మలిచేందుకు చర్యలు చేపడతామని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. చదవండి : జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు
Comments
Please login to add a commentAdd a comment