
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌పై ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను రెండేళ్లపాటు నిలుపుదల చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ గురువారం అందుకున్నారు. కాగా పోలవరంపై స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను మరో రెండేళ్లపాటు స్తంభింపచేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిన్న సంతకం చేశారు. ప్రాజెక్ట్ వేగవంతంగా నిర్మాణం కావాలని ఈసారి రెండేళ్లపాటు పొడిగింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment