పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. సీఎం నారాయణ స్వామి రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రపతి అనుమతి తరువాత అసెంబ్లీ రద్దవుతుందన్నారు. 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాక ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. గురువారం పుదుచ్చేరిలో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రూ.కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు. పుదుచ్చేరిని తమిళనాడులో చేర్చేందుకు బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నారాయణస్వామి బుధవారం ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment