సాక్షి, న్యూఢిల్లీ : మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు, కార్మికులు కోరారు. ఈమేరకు ఎంపీలు కె.కవిత, బూర నర్సయ్యగౌడ్, బాల్కసుమన్, కార్మికులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విన్నవించారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర కార్మిక చట్టాలను మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వర్తింపజేసి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కవిత మీడియాకు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి కనీస వేతనాలు అందేలా కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment