నేడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం | BJP Plans Big Public Meeting On Sept 17 | Sakshi
Sakshi News home page

నేడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం

Published Fri, Sep 8 2023 2:38 AM | Last Updated on Fri, Sep 8 2023 2:38 AM

BJP Plans Big Public Meeting On Sept 17 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు, సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ స్టేట్‌ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, రాష్ట్ర పార్టీ సన్నద్ధమవుతున్న తీరు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.

ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, ఎంపీ ప్రకాశ్‌ జవదేకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement