భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కె.జి.యఫ్ ఛాప్టర్ 2.. ప్రేక్షకులకు ఎలివేషన్ ఫీస్ట్‌ను అందించింది. కథ విషయంలో పెద్దగా మలుపులు లేకపోయినా.. మిగతా ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో మెప్పించగలిగాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. యశ్ స్క్రీన్ ప్రజెన్స్ రెండో భాగానికీ మేజర్ హైలెట్ అయ్యింది. ఓవరాల్‌గా.. సినిమా చాలా మందికే నచ్చేసింది. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం నెగెటివ్ రివ్యూలతో విరుచుకుపడింది.
కె.జి.యఫ్ ఛాప్టర్ 2కు మాతృక కన్నడతో సహా దాదాపు అన్ని భాషల్లోనూ బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. మొదటి ఆట నుంచే యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుంది ఈ చిత్రం. తమిళనాడులో అయితే విజయ్ బీస్ట్ చిత్రం థియేటర్ల దగ్గర ఆడియొన్స్ బాగా తగ్గిపోగా.. రాఖీబాయ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపించడం విశేషం. ఇక తెలుగు ఆడియొన్స్ ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా దాదాపుగా సౌత్‌లోని అన్ని భాషల్లోనూ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు దక్కాయి. అయితే..
రిలీజ్‌కు ముందు సైతం పెద్దగా హడావిడి చేయని హిందీ మీడియా.. రిలీజ్ తర్వాత కూడా కేజీయఫ్ ఛాప్టర్ 2కి దాదాపుగా నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. పైగా సినిమాలోని మైనస్‌లనే హైలైట్ చేస్తూ రివ్యూలు ఇచ్చాయి. హిందీ మీడియాలో సినిమాను పొగుడుతూ రివ్యూలు ఇచ్చిన వెబ్‌సైట్లు ఒకటో రెండో ఉండగా, ఒకరిద్దరు విశ్లేషకులు మాత్రమే పాజిటివ్‌గా రాశారు. కేజీయఫ్ ఛాప్టర్ 2 విషయంలోనే కాదు.. మొన్న పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ విషయంలోనూ కొన్ని మెయిన్ మీడియా హౌజ్‌లు దాదాపుగా ఇదే రీతిలో వ్యవహరించాయి.
ఏది ఏమైనా ఈ తీరుతో బాలీవుడ్ మీడియా మరోసారి సౌత్ సినిమాల మీద అక్కసు వెల్లగక్కినట్లయ్యింది. కానీ.. సినిమాను ఆదరించేది అంతిమంగా ఆడియొన్స్. కాబట్టి, ఇలాంటి చేష్టల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక కే.జి.యఫ్ 2కు నార్త్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ దక్కుతోంది. ఒక్క హిందీ బెల్ట్‌లోనే తొలిరోజు రూ. 50 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా.
చదవండి: కేజీయఫ్ 2 రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment