మనల్ని ఎంటర్‌టైన్ చేసే సినిమా స్టార్స్.. నటించడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తుంటారు. మొన్నటివరకు ఫుడ్, రెస్టారెంట్స్ లో వీళ్లు ఎక్కువగా కనిపించారు. రీసంట్ టైంలో మహేశ్, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు మల్టీప‍్లెక్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇవన్నీ చాలా సాధారణ విషయాలన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో, 'కేజీఎఫ్ 2' విలన్ ఎవరూ ఊహించని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కళ్లు చెదిరే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది.
సంజయ్ దత్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. డ్రగ్స్ కి బానిసవడం, అక్రమాయుధాల కేసులో జైలుకి వెళ్లడం లాంటి చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. అదంతా పక్కనబెట్టి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్, సహాయక పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. గతేడాది 'కేజీఎఫ్ 2'లో అధీరాగా భయపెట్టిన సంజూ.. ప్రస్తుతం విజయ్ 'లియో', ప్రభాస్-మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు.
ఇలా కెరీర్ పరంగా బాగా సంపాదిస్తున్న సంజయ్ దత్.. ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రిటైల్ బిజినెస్ చేయడమే టార్గెట్ గా కార్టెల్ & బ్రోస్ అనే ఆల‍్కోబెవ్ (ఆల్కహాలిక్ బేవరేజ్) స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ ఎక్కువగా స్కాచ్-విస్కీ తయారు చేస్తుంది. మన దేశంలో పోర్ట్ ఫోలియోని విస్తరించడమే లక్ష‍్యంగా.. ఈ కంపెనీలో సంజయ్ దత్ దాదాపు రూ.1000 కోట్ల మొత్తం పెట్టుబడిగా ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment