అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ | Raveena Tandon throws up after co-star's lips brushed against hers | Sakshi
Sakshi News home page

Raveena Tandon: పెదవులు తాకగానే.. ఆమెకి ఏదోలా అయిపోయింది!

Published Thu, Sep 28 2023 4:21 PM | Last Updated on Thu, Sep 28 2023 4:36 PM

Raveena Tandon Feel Nausea After Kiss With Actor - Sakshi

ఇప్పుడు ఏ భాషలో సినిమా తీసుకున్నా ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రేక్షకులకు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే స్క్రీన్‌పై అది చూడటానికి బాగానే ఉన్నా.. దాని వెనక కష్టాలు పెద్దగా ఎవరికీ తెలియవు. అయితే గతంలో తనకు ముద్దు వల్ల జరిగిన చేదు అనుభవాన్ని 'కేజీఎఫ్' ఫేమ్ రవీనా టాండన్ బయటపెట్టింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు)

ఏం జరిగింది?
1991 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రవీనా టాండన్.. హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ హీరోయిన్‌గా చేసింది. టాలీవుడ్ వరకు వస్తే బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించింది. 'కేజీఎఫ్ 2'లో రమికా సేన్ పాత్ర చేసి చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే 'నో కిస్సింగ్ రూల్' పాటించే ఈమెకు కెరీర్ ప్రారంభంలో అనుకోకుండా సహనటుడి పెదాల్ని తన పెదాలతో. దీంతో ఈమెకు వాంతి అయిందట.

రవీనా కామెంట్స్
'ఎప్పుడూ ముద్దు సీన్స్‪‌లో నటించలేదు. ఎందుకో వాటిలో యాక్ట్ చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే నటించను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓ సీన్ చేస్తున్నప్పుడు సహనటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అది అతడు కావాలని చేయలేదు. కానీ చిరాగ్గా అనిపించింది. వెంటనే గదిలోకి వెళ్లిపోయా. ఎంతో వికారంగా అనిపించింది. వాంతి చేసుకున్నా. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించింది' అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. అయితే అది ఏ సినిమా, నటుడెవరు తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు.

(ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement