ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా వాలకం చూస్తే కొత్త కొత్త పుంతలు, సరికొత్త నిర్వచనాలు స్ఫురిస్తున్నాయి. నేడు మీడియా అంటే రాజకీయాల కోసం, రాజకీయాలు నడిపే రాజకీయం– అని చెప్పుకోవడం సబబేమో! సరిగ్గా సంవత్సరం క్రితం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత– పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత మీడియా ఎలా ప్రవర్తించిందో అందరికీ గుర్తుంది. లేని విషయాలు ఉన్నట్టు, నెలన్నరపాటు ఊకలా దంచి, ఎన్నికల ఫలితాలు రాగానే ఆంధ్రప్రదే శ్‌లో ప్రజాభిప్రాయ ధోరణి గురించి మాట్లాడకుండా ఇతర రాష్ట్రాల ఫలి తాల తీరు సంబంధించి చర్చించడం ప్రారంభిం చారు. నిజానికి ఇతర రాష్ట్రాల పోకడల మీద ఆసక్తి ఉంటే ప్రచారం సమయంలో కూడా అలాగే సాగి ఉండాలి కదా! అభూతకల్పనలకు వ్యతి రేకంగా ప్రజలు గట్టిగానే తీర్పు ఇచ్చారు. ఈ మీడియా ధోరణిని మొత్తం దేశం గుర్తించినా అంగీకరించడానికి వీరు సిద్ధంగా లేరు.
ప్రజల స్థాయిలో ఏమి జరుగుతుందో అసలు పట్టించుకోకుండా తమకు ‘అవసరమైన విషయాలు’ మాత్రమే ప్రముఖమైన వార్తలుగా వండి వార్చడం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ చరి త్రలో అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పనితనం, ప్రణాళికలు, ఫలితాల గురించి కాకుండా వేరే అంశాలు వార్తలుగా చేస్తున్నారు. తొలి సంవత్సరం ముగిసి, రెండో సంవత్సరంలో ప్రవేశిస్తున్న వేళ–సంబంధంలేని సంచలనంతో దృష్టి మళ్ళించే ప్రయత్నం పుష్కలంగా చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా 1,088 అంబులెన్స్‌లు విజయవాడలో బయలుదేరే ముహూర్తానికి కొన్ని గంటల ముందు ఏమి వార్త ప్రచురించారు? ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం అంటూ పత్రికా శీర్షికగా ఎందుకు వస్తుంది? రెండు రాష్ట్రాలలో రెండు రకాలుగా వార్తలు వార్చాల్సిన అవసరం ఏమిటి? ఏ లక్ష్యంతో వార్తలు ఇలా రాసుకున్నా– ఆ రోజు టెలివిజన్‌లో బారులుగా నడుస్తున్న ఆంబులెన్స్ వాహనాల దృశ్యాల ప్రభావం విశేషం.
కాకతాళీయంగా ఆంబులెన్స్ వాహనాలు బయలుదేరిన రోజు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం అంటూ ఏపీలోని పెద్దపత్రిక వార్తలు రాసిన రోజున తెలంగాణ హైకోర్టు కరోనా గురించి ఆ రాష్ట్రాన్ని చాలా వివరాలను అడిగింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆంగ్ల దినపత్రిక జూలై 2వ తేదీన తొలి పేజీలో ప్రధానంగా ఈ వార్తను ప్రచురిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఆంబులెన్స్ సేవల ప్రస్తావన కూడా తెచ్చింది. కరోనా పెచ్చరిల్లే సమయాన అమరావతి ఉద్యమం, ఆ ఉద్యమానికి వంద రోజులు వంటి వార్తలు ఇచ్చారు. ఇప్పుడు కరోనా నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నపుడు మరోరకమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో వివిధ అంగాల మధ్య కనబడే పనితనం గురించి కూడా మీడియాతో సహా అందరూ గమనించాలి. ఎన్నికైన ప్రభుత్వం చెప్పే మాటలనూ, ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులను కూడా ప్రజలు పోల్చుకునే వెసులుబాటు ప్రజాస్వామ్యంలో ఉంది. ప్రజల విషయాన్ని మీడియా పూర్తిగా విస్మరించడం.. సోషల్ మీడియా వ్యాప్తి కాని రోజుల్లో బోధపడటానికి చాలాకాలం పట్టేది. ఇప్పుడు వార్తలను మీడియా ఎలా వక్రీకరి స్తుందో ప్రజలు సులువుగా తెలుసుకుంటున్నారు. ఏ మీడియా సంస్థకు ఎంత మినహా యింపు ఇవ్వాలో కూడా పాఠకులకూ, వీక్షకులకూ బాగా తెలుసు.
ప్రజలనూ, ప్రజల అవసరాలనూ పూర్తిగా విస్మరించిన మీడియా దిగజారిన విశ్వసనీయత వారి వాణిజ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందన్న స్పృహను కోల్పోతుంది. కరోనా కారణంగా కుదేలైన మీడియా ఉద్యోగులను తగ్గించుకుంటూ సాయంకోసం అర్రులు చాస్తోంది. ఇలాంటి సమయంలోనూ ప్రజామోదాన్ని సైతం ఖాతరు చేయకపోవడం వెనుక వీరి అంతర్గత వ్యూహం ఏమిటో? స్వల్పకాలిక ప్రయోజనాలు కాదు కదా, దీర్ఘకాలిక నష్టాలవైపు ఈ రాజకీయ మీడియా సాగడం ఎవరికీ మంచిది కాదు, వారికి అసలే మంచిది కాదు!
వ్యాసకర్త: డా‘‘ నాగసూరి వేణుగోపాల్
సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత
మొబైల్ : 94407 32392
Comments
Please login to add a commentAdd a comment