కోల్‌కతా: భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల గురించి విదేశీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికల గురించి వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోందన్నారు. తాను రాసిన ‘‘వై భారత్ మాటర్స్’’ బుక్ బంగ్లా ఎడిషన్‌ను జైశంకర్.. కోల్‌కతాలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడారు.
‘‘విదేశీ మీడియా మన దేశాన్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకుంటే ఈ ప్రపంచాన్ని వాల్లు గత 70-80 ఏళ్ల నుంచి ప్రభావం చేస్తున్నామని భావిస్తున్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాలు సైతం వాళ్లు ప్రపంచాన్ని 200 ఏళ్ల నుంచి ప్రభావితం చేస్తున్నామని భావిస్తున్నాయి. వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవటం అంత సులువైన పని కాదు.
..విదేశీ మీడియా ఎందుకు భారత్‌కు వ్యతిరేకంగ కథనాలు ప్రచురిస్తోంది?. ఎందుకంటే దేశంలో ఒక వర్గం వారు పాలించాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రభావితం చేయలానుకుంటోంది. కానీ, భారతీయ ప్రజలంతా అలా భావించటం లేదు. అదీకాక విదేశీ మీడియా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సైతం బహిరంగంగా ఆమోదం తెలుపుతోంది. వారు తమ ప్రాధాన్యతను దాచుకోవటం లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. కొంతమంది ఇలానే 300 ఏళ్ల నుంచి ప్రవర్తిస్తూ చాలా అనుభవం పొందారు.
..కొన్ని న్యూస్‌పేపర్లు తరచూ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఇండెక్స్‌ల్లో తక్కువగా చూపుతారు. తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించుకోవడానికి కోర్టుకు వెళ్లే దేశాలు సైతం.. మనకు ఎన్నికలు నిర్వహించటం గురించి తెలియజేయటం చాలా విడ్డూరం’’ అని జైశంకర్ అన్నారు.
ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై అమెరికా చేసిన ఆంక్షల హెచ్చరికలపై మంత్రి శంకర్ స్పందించారు.
‘ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ విషయంలో సంకుచితంగా ప్రవర్తించటం మానుకోవాలి. గతంలో ఇదే చాబహార్ పోర్టు గురించి అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇది అందరీ ప్రయోజనం కోసం చేపట్టిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా సంకుచితం స్వభావంతో చూడవద్దు’ అని జైశంక్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment