jai shanker
-
మూడోసారి ప్రధానిగా మోదీ..కాళ్ల బేరానికొచ్చిన చైనా?!
భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది. కేంద్రంలో మూడోవిడత మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం విషయంలో మరింత దూకుడు పెంచింది. వాస్తవాధీనరేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా అక్రమిత టిబెట్‌లోని 30 ప్రాంతాల పేర్లు మార్చాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. ఇదే విషయంలో చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న భారత్ డ్రాగన్ ఆక్రమిత టిబెట్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది.దీనికి తోడు రెండవసారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి సమస్యలను పరిష్కరించడంపై భారత్ దృష్టి సారిస్తుందని జైశంకర్ తెలిపారు.ఈ తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత్‌తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని,తమ సరిహద్దు వివాదాలను సక్రమంగా నిర్వహించాలని భారత్‌లోని చైనా రాయబార కార్యలయం ఎక్స్ వేదికగా స్పందించింది. మూడో విడత మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. చైనా,భారత్‌లు పొరుగు దేశాలు. సంబంధిత సరిహద్దు సమస్యలను సక్రమంగా నిర్వహించాలి. ఈ రెండు దేశాల్లో అభివృద్ది,శాంతికి అనుకూలంగా ఉన్నాం.భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సరైన దిశలో ముందుకు తీసుకెళ్లాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ట్వీట్లో పేర్కొంది. -
అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలపై స్పందించిన జైశంకర్
కోల్‌కతా: భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల గురించి విదేశీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికల గురించి వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోందన్నారు. తాను రాసిన ‘‘వై భారత్ మాటర్స్’’ బుక్ బంగ్లా ఎడిషన్‌ను జైశంకర్.. కోల్‌కతాలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడారు.‘‘విదేశీ మీడియా మన దేశాన్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకుంటే ఈ ప్రపంచాన్ని వాల్లు గత 70-80 ఏళ్ల నుంచి ప్రభావం చేస్తున్నామని భావిస్తున్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాలు సైతం వాళ్లు ప్రపంచాన్ని 200 ఏళ్ల నుంచి ప్రభావితం చేస్తున్నామని భావిస్తున్నాయి. వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవటం అంత సులువైన పని కాదు...విదేశీ మీడియా ఎందుకు భారత్‌కు వ్యతిరేకంగ కథనాలు ప్రచురిస్తోంది?. ఎందుకంటే దేశంలో ఒక వర్గం వారు పాలించాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రభావితం చేయలానుకుంటోంది. కానీ, భారతీయ ప్రజలంతా అలా భావించటం లేదు. అదీకాక విదేశీ మీడియా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సైతం బహిరంగంగా ఆమోదం తెలుపుతోంది. వారు తమ ప్రాధాన్యతను దాచుకోవటం లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. కొంతమంది ఇలానే 300 ఏళ్ల నుంచి ప్రవర్తిస్తూ చాలా అనుభవం పొందారు. ..కొన్ని న్యూస్‌పేపర్లు తరచూ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఇండెక్స్‌ల్లో తక్కువగా చూపుతారు. తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించుకోవడానికి కోర్టుకు వెళ్లే దేశాలు సైతం.. మనకు ఎన్నికలు నిర్వహించటం గురించి తెలియజేయటం చాలా విడ్డూరం’’ అని జైశంకర్ అన్నారు.ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై అమెరికా చేసిన ఆంక్షల హెచ్చరికలపై మంత్రి శంకర్ స్పందించారు.‘ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ విషయంలో సంకుచితంగా ప్రవర్తించటం మానుకోవాలి. గతంలో ఇదే చాబహార్ పోర్టు గురించి అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇది అందరీ ప్రయోజనం కోసం చేపట్టిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా సంకుచితం స్వభావంతో చూడవద్దు’ అని జైశంక్ అన్నారు. -
వ్యవసాయానికి ‘ఏఐ’..భారత్‌లో గూగుల్ ప్రాజెక్ట్ హైలెట్స్ ఇవే!
భారత్‌లో పర్యటిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్..కేంద్రమంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతున్న తీరు, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల గురించి చర్చించారు. మారుతున్న డిజిటల్ అవసరాల కోసం ఏఐతో కలిసి కృషిచేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్.. భవిష్యత్‌లో టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం నుంచి యూపీఐ పేమెంట్స్ వరకు ఎలాంటి మార్పులు చేయబోతున్నామో స్పష్టం చేశారు. ►ఈ సందర్భంగా.. ఏఐ ద్వారా వ్యవసాయ భూముల డిజిటైజేషన్ కు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది ►భారతీయులకు ఇంటర్నెట్ మరింత సహాయకారిగా ఉండటానికి అన్ని జిల్లాల్లో భారతదేశ భాషావైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని ప్రారంభించింది ►భారతదేశపు మొట్టమొదటి బాధ్యతాయుతమైన ఏఐ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో సహాయపడటానికి ఐఐటీ మద్రాస్‌కు 1 మిలియన్ అమెరికన్ డాలర్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది ►ప్రారంభ దశ, మహిళల నేతృత్వంలోని స్టార్టప్ లకు గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ మద్దతును ప్రకటించింది ►ద్విభాషా వినియోగదారుల అవసరాలు, కెమెరా, వాయిస్‌తో కొత్త శోధన సామర్థ్యాలపై దృష్టి సారించే సెర్చ్ కోసం అనేక కొత్త ఇండియా-ఫస్ట్, ఇండియా-ఫోకస్డ్ ఆవిష్కరణలను ప్రకటించింది ►ఆండ్రాయిడ్ పై గూగుల్ యాప్ ద్వారా నేరుగా ఫైళ్లలో డిజిలాకర్ ఇంటిగ్రేషన్ ను ప్రకటించింది. ఇది కీలక డిజిటల్ డాక్యుమెంట్లను ప్రైవేటుగా, సురక్షితంగా, సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి అనుమతిస్తుంది ► గూగుల్ పే ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో జరిగే మోసాలను గుర్తించే కొత్త మోడల్ ను ప్రారంభించింది -
భారత్, మాల్దీవుల రక్షణ బంధం
మాలే: భారత్, మాల్దీవుల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైంది. మాల్దీవుల నావికాదళ బలోపేతానికి తాము పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తామని భారత్ మరోసారి స్పష్టం చేసింది. రక్షణ రంగంలో ప్రాజెక్టుల కోసం ఇరు దేశాల మధ్య 5 కోట్ల డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం కుదిరింది. మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్‌కు చెందిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుల మ«ధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్ బ్యాంకు నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకుంటాయి. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా దీదీ, ఆర్థిక మంత్రి ఇబ్రహీంలతో చర్చించిన తర్వాత ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మాల్దీవుల రక్షణకు కట్టుబడి ఉన్నామని ఎప్పుడైనా ఆ దేశానికి భారత్ విశ్వసనీయమైన నేస్తమని జై శంకర్ ట్విట్ చేశారు. 5 కోట్ల డాలర్ల రుణ ఒప్పందంతో పాలు మాల్దీవుల్లోని తీరప్రాంత రక్షణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం జై శంకర్ మారియా దీదీలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2016లో కుదుర్చుకున్న రక్షణ కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ఒప్పందాలు కుదిరాయి. మాల్దీవుల్లో రేవులు, డాక్‌యార్డ్‌ల నిర్మాణం, వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రాడార్ సర్వీసులు, ఆ దేశ నావికాదళానికి శిక్షణ వంటి వాటిలో భారత్ సహకారం అందించనుంది. -
వాస్తవ సంఘటనలతో...
జై శంకర్, తనీష్ అగర్వాల్ జంటగా జై శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైదానం’. శ్రీ సాయి సిరి సంపద మూవీస్ పతాకంపై డి.నాగరాజు, ఎం. శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జై శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇదొక డిఫరెంట్ యాక్షన్, సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్. చిన్న పిల్లల మీద బీహార్‌లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 7న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటీనటులతో పాటు కొత్తవారు నటిస్తారు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, కేరళలో చిత్రీకరించనున్నాం. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, నాగబాబు, సుమన్, భానుప్రియ, ‘రంగస్థలం’ మహేష్, ‘జబర్దస్త్’ రాము, రవి దాసరాజు, కరీంషేక్, లతిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కొణిదెల, సంగీతం: యమ్.యమ్ కుమార్. -
'తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవు'
హైదరాబాద్: తెలంగాణ సిద్దాంతకర్త, ప్రొ కె.జయశంకర్ ఆశయాలకనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కే తారక రామారావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 4వ వర్ధంతి వేడుకలను ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..వరంగల్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు జయశంకర్ పేరుపెడతామన్నారు. జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు పెట్టామన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో..తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవన్నారు. చట్ట ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.