కోవిడ్-19, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వంటి వివిధ కారణాలతో ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో కేవలం రెండు నెలలో ఒక్క టెక్నాలజీ రంగంలో 1.25లక్షల మంది ఉపాది కోల్పోగా..ఈ తొలగింపులు ఇప్పుడు మీడియా రంగాన్ని సైతం కుదిపేస్తున్నాయి.
యాక్సియోస్ నివేదిక ప్రకారం..ప్రపంచ ఆర్థిక మందగమనంతో సంస్థలు ప్రకటనలపై చేసే ఖర్చును తగ్గించాయి. వెరసి మీడియా రంగంలో ఉద్యోగాల తొలగింపు షురూ అయినట్లు తెలిపింది.
► గత నెలలో మీడియా ఇండస్ట్రీలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వార్న్‌ర్ బ్రదర్స్‌కు చెందిన డిస్కవరీలో ఉద్యోగాల కోత కొనసాగుతుండగా.. రానున్న రోజుల్లో సిబ్బందిని ఇంటికి పంపేందుకు మీడియా యాజమాన్యాలు సిద్ధమైనట్లు సీఎన్‌ఎన్ చీఫ్ క్రిస్ లిచ్ట్ తెలిపారు.
►పారామామౌంట్ గ్లోబల్ నుంచి వాల్ట్ డిస్నీ కంపెనీలు, ఇతర మీడియా సంస్థలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయడం, నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
►కామ్‌క్యాస్ట్ కేబుల్ యూనిట్ గత నెలలో ఉద్యోగుల్ని తొలగించింది. ఆ సంస్థ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం, ఎన్‌బీసీ యూనివర్సల్‌లో సైతం తొలగింపులు ఉంటాయని నివేదికలు పేర్కొన్నాయి.
►ప్రోటోకాల్, పొలిటికో నుండి 2020లో టెక్ న్యూస్ వెబ్‌సైట్ ప్రారంభమైంది. ఆ వెబ్ సైట్ ఈ ఏడాది చివరి నాటికి షట్‌డౌన్ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. తద్వారా యాక్సియోస్ ప్రకారం, దాదాపు 60 మంది ఉద్యోగులు ఉద్యోగులు కోల్పోనున్నారు.
►వైస్ మీడియా సీఈవో నాన్సీ డుబాక్ ఈ నెల ప్రారంభంలో చిన్న కోతల తర్వాత 15 శాతం వరకు ఖర్చులను తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు సిబ్బందికి తెలిపారు.
►నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోవిడ్ కారణంగా మీడియా నిర్వాహణ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో యుఎస్‌ఎ టుడే మాతృ సంస్థ గానెట్, ఆగస్ట్‌లో 400 మందిని తొలగించింది. మరో సారి ఉద్యోగుల్ని ఫైర్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
చదవండి👉 ‘ట్విటర్‌లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment