సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి  | Wealth increased and debts decreased | Sakshi
Sakshi News home page

సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి 

Published Fri, Aug 4 2023 5:06 AM | Last Updated on Fri, Aug 4 2023 4:00 PM

Wealth increased and debts decreased - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్సార్‌ సీపీ పాలనలో సంపద పెరగడంతోపాటు అప్పులు తగ్గాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గణాంకాలతో సహా మీడియాకు గురువారం వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రి, కాగ్‌ చెప్పినవి వాస్తవాలని తెలిపారు. కొందరు స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లు అంటూ చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదన్నారు. ఎల్లో మీడియా, విపక్షాల మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులపై పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కలు, అసెంబ్లీలో సీఎం వెల్లడించిన గణాంకాలు మాత్రమే వాస్తవాలన్నారు.

రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఇంత తక్కువ ఎలా చెబుతారంటూ ఎల్లో మీడియాతో పాటు విపక్ష నేతలు బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. కేరళను అప్పులకు అనుమతించకుండా ఏపీకి మాత్రం ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు ప్రచురించడం విచిత్రంగా ఉందన్నారు.  

గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎల్లో మీ­డి­యా ఏనాడైనా కథనాలు ప్రచురించిందా? ఇప్పు­డు రూ.వెయ్యి కోట్ల అప్పులపై ఐదుసార్లు వార్తలు రాసి రూ.ఐదు వేల కోట్ల అప్పుల తరహాలో చిత్రీకరిస్తోంది. బడ్జెట్‌ బయట చూసినా లోపల చూసి­నా అప్పులు చంద్రబాబు హయాంలోనే ఎ­క్కువగా ఉన్నాయి. ఆయన హయాంలో పరిమితికి మించి రూ.16,418 కోట్లు అప్పులు చేయడంతో ఇప్పుడు ఆ మేరకు కోత పడింది. అనుమతి ఉన్నా సరే మేం రూ.28,466 కోట్లు తక్కువ అప్పులు చేశాం.  

 చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం కాగా ఇప్పుడు 12.4 శాతం మాత్రమే ఉంది. మేం అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్ర­బాబు హయాంలో చేసిన అప్పులు ఎటు వెళ్లినట్లు? టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగలేదు కానీ అప్పులు మాత్రం పెరిగాయి. తాను సంపద పెంచే నిపుణుడినంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. కర్నాటక, తమిళనాడుతో పాటు వైఎస్సార్‌సీపీ పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టోలను ప్రకటించుకున్నారు.  

 గత ఎన్నికల ముందు ఏప్రిల్‌లో పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు రూ.5,500 కోట్లు అప్పు చేయలేదా? వచ్చే ప్రభుత్వం పాలన చేయలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేరు. ఇక అప్పులు పుట్టకుండా చేశామంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించలేదా? అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏ సంక్షేమ పథకాన్నీ ఆపకుండా నిర్విఘ్నంగా అమలు చేస్తోంది. పరిమితికి లోబడే అప్పు­లు చేస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయ­డంతోపాటు పార్లమెంట్‌లోనూ ప్రశి్నంచారు. కేంద్రం వాస్తవాలను వెల్లడించడంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలకు దిక్కు తోచట్లేదు. 

  దేశంలో రాష్ట్రానికో నిబంధన ఉండదు. పరిమితికి లోబడి కేంద్రం అప్పులను అనుమతిస్తోంది.  

రాష్ట్ర అప్పులపై మాట్లాడుతున్న వారు, కథనాలను ప్రచురిస్తున్న వారు అసలు మన రాష్ట్రంలోనే ఉండరు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ అప్పుల గురించి దు్రష్పచారం చేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు అప్పులు చేస్తే ఇప్పుడు రూ.10 వేల కోట్లు మాత్రమే అప్పు చేశాం. విద్యుత్‌ సంస్థలకు భారీగా పెట్టిన బకాయిలను సైతం తీరుస్తున్నాం. రెవెన్యూ రాబడులు, వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధిని గమనిస్తే సంపద ఎవరి హయాంలో ఎంత పెరిగిందో స్పష్టమవుతుంది.  

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ వయసులో తాను కొదమ సింహం అంటూ జంతువులతో పోల్చుకోవడం ఎందుకు? సింహం అంటే సింగిల్‌గా వస్తుంది. మరి ఆయన ఎప్పుడైనా సింగిల్‌గా పోటీ చేశారా? చంద్రబాబు పొత్తులు పెట్టుకోని పార్టీ లేదు. ఒకే పారీ్టతో రెండేసి సార్లు పొత్తులు పెట్టుకున్న ఘనత ఆయనదే.  

 కొత్తగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించినవారు ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు అంటే ఏమిటో అధ్యయనం చేశాక మాట్లాడాలి. నాబార్డు నుంచి రూ.7,992 కోట్లు అప్పులు చేయలేదు. తీసుకున్నది రూ.3,281 కోట్లు మాత్రమే. కంటిన్జెన్సీ ఫండ్‌ గవర్నర్‌ వద్ద అత్యవసరాల కోసం ఉంటుంది. కొత్తగా వచి్చన వారు దాన్ని కూడా అప్పు కింద లెక్కించారు. పబ్లిక్‌ అకౌంట్‌ పద్దు నుంచి గత ప్రభుత్వం రూ.36,241 కోట్లు వాడుకోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3,475 కోట్లు మాత్రమే వినియోగించుకుంది.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్సార్‌ హయాంతోపాటు విభజన అనంతరం మరోసారి టీడీపీ పాలనలో, వైఎస్సార్‌సీపీ వచ్చాక బడ్జెట్‌ బయట, లోపల చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వడ్డీల శాతం గణాంకాలను బుగ్గన వెల్లడించారు. ఆ వివరాలివీ... 

2014–15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,22,605 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 23.35 శాతం)  
2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 30.27 శాతం) 
2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.5 శాతం) 
చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికిపైగా పెరగగా ఇప్పుడు నాలుగేళ్లల్లో మూడు శాతం మాత్రమే పెరిగాయి. 

2014 – 2019 అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం 
2019 నుంచి 2022–23 వరకు అప్పుల వార్షిక వృద్ధి రేటు 12.4 శాతం 
చంద్రబాబు హయాం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధి రెండు శాతం తక్కువగానే ఉంది 

1999 – 2004 రెవెన్యూ రాబడులు వృద్ధి  12.4 శాతం (ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాం)
2004 – 2009 రెవెన్యూ రాబడులు వృద్ధి 21.6 శాతం  (వైఎస్సార్‌ హయాం)
2014 – 2019 రెవెన్యూ రాబడులు వృద్ధి  6 శాతం 
2019 – 2023 రెవెన్యూ రాబడులు వృద్ధి  16.7 శాతం 
వైఎస్సార్‌ హయాంతో పోలిస్తే చంద్రబాబు జమానాలో రెవెన్యూ రాబడులు 15.6 శాతం క్షీణించగా ఇప్పుడు 10.7 శాతం పెరిగాయి 
2014 – 2019 రాష్ట్ర స్థూల ఉత్పత్తి  రూ.6,95,000 కోట్లు 
2019 – 2023 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11,00,000 కోట్లు 
రాష్ట్ర విభజన నాటికి గ్యారెంటీలు, గ్యారెంటీలు ఇవ్వని అప్పులు రూ.35,000 కోట్లు 
   2019 మే నాటికి ఆ అప్పులను చంద్రబాబు రూ.1,40,500 కోట్లకు పెంచారు. 
అంటే 21.8 శాతం పెంచారు. 
వైఎస్సార్‌సీపీ వచ్చాక రూ.2,09,000 కోట్లకు పెరిగాయి. అంటే 12.6 శాతమే పెరిగాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement