మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
తాజాగా రూ.4,237 కోట్ల అప్పు చేసిన సర్కార్
సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నన్ను గెలిపించండి.. సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా.. నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్’ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేయడం పైనే దృష్టి పెట్టారు. మంగళవారాన్ని పూర్తిగా అప్పుల వారంగా మార్చేశారు. తాజాగా మంగళవారం సెక్యురిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 7.11 శాతం వడ్డీకి రూ.4,237 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది.
10 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,237 కోట్లు, 14 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,500 కోట్లు, 15 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,500 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దీంతో బాబు సర్కార్ ఆరు నెలల్లో ఇప్పటి వరకు చేసిన అప్పు రూ.67,237 కోట్లకు చేరింది. ఇందులో బడ్జెట్ లోపల రూ.59,237 కోట్లు అప్పు చేయగా, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరు మీద రూ.8,000 కోట్లు అప్పు చేసింది.
కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు తమ కార్యకలాపాలకు అప్పు చేసేందుకు గ్యారంటీలు ఇవ్వడాన్ని చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా తప్పుపట్టాయి.
కానీ ఇప్పుడు పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.2,000 కోట్లు, మార్కెఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు, ఏపీఐఐసీ ద్వారా రూ.1,000 కోట్లు.. కలిపి మొత్తం రూ.8,000 కోట్ల అప్పునకు చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి0ది. చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే అది ఒప్పులా.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తప్పులా ఎల్లో మీడియాకు కనిపించడం గమనార్హం.
ఈ వారం అప్పు రూ.4,237 కోట్లు
ఇప్పటి వరకు చేసిన మొత్తం అప్పు రూ. 67,237 కోట్లు
బడ్జెట్ లోపల రూ.59,237 కోట్లు
బడ్జెట్ బయట రూ.8,000 కోట్లు
ప్రభుత్వ గ్యారంటీలతో బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పులు (రూ.కోట్లలో..)
పౌరసరఫరాల సంస్థ రూ.2,000 కోట్లు
మార్క్‌ఫెడ్ రూ.5,000 కోట్లు
ఏపీఐఐసీ రూ.1,000 కోట్లు
మొత్తం రూ.8,000 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment