caag
-
అయినా.. పట్టాలెందుకు తప్పుతున్నాయ్!
సాక్షి, అమరావతి: రైల్వేలను ఆధునికీకరిస్తున్నాం.. బుల్లెట్ రైళ్లు, హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెడుతున్నాం.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఘనమైన ప్రకటనలివి. అయినా.. దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దేశంలో రైళ్లు పట్టాలు తప్పి.. ప్రమాదానికి గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరుగుతుండడంఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. రైల్వే శాఖ ఘనమైన చర్యలు చేపడుతున్నా దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతుండటంపై కం్రప్టోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) తీవ్రంగా ఆక్షేపించింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, గేజ్ మార్పిడి, కొత్త లైన్ల నిర్మాణానికి కేటాయించే నిధుల్లో కోత విధిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గాడి తప్పుతున్న రైళ్లు నాలుగేళ్లుగా రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు పెరుగుతున్నాయి. 2021–22లో 27 ప్రమాదాలు సంభవించగా... 2022–23లో 36 చోట్ల రైళ్లు పట్టాలు తప్పాయి. ఒకే ట్రాక్ మీదకు ఎదురెదురుగా రైళ్లు వచ్చి ఢీకొన్న ప్రమాదాలు కూడా సంభవిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2021–22లో రెండు ప్రమాదాలు సంభవించగా.. 2022–23లో రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదాలు ఏకంగా ఆరు సంభవించాయి. కొత్త లైన్ల నిర్మాణానికీ నిధుల తగ్గింపు రైల్వే భద్రతకు కీలకమైన కొత్త లైన్ల నిర్మాణానికి నిధుల కేటాయింపును కూడా రైల్వే శాఖ క్రమంగా తగ్గిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా రైల్వే బడ్జెట్లో కనీసం 15 శాతం నిధులను కొత్త లైన్ల నిర్మాణానికి కేటాయించాలన్నది ప్రామాణికంగా నిర్దేశించారు. కానీ.. రైల్వే శాఖ మూడేళ్లుగా ఈ ప్రమాణాలను పాటించడం లేదు. 2022–23 బడ్జెట్లో 14.1 శాతం నిధులు కేటాయించగా.. 2023–24కు కొత్త రైల్వే లైన్ల నిర్మాణ నిధులను 10.3 శాతానికి తగ్గించారు.ఇటీవల ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో కొత్త లైన్ల నిర్మాణం కోసం కేవలం 7 శాతం నిధులనే కేటాయించడం విస్మయం కలిగిస్తోంది. అదే విధంగా గేజ్ మారి్పడి కోసం మొత్తం బడ్జెట్లో కనీసం 3 శాతం నిధులు కేటాయించాలన్న ప్రామాణిక నిర్దేశం. రైల్వే శాఖ మాత్రం 2022–23లో 2 శాతం నిధులు కేటాయించగా.. 2023–24లో కేవలం 1.6 శాతం నిధులే కేటాయించారు. ఇటీవల ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో కొద్దిగా పెంచి 1.8 శాతం నిధులతో సరిపెట్టారు. మరోవైపు కేటాయిస్తున్న అరకొర నిధులను కూడా రైల్వే శాఖ ఆయా పనులకు పూర్తిగా వెచ్చించడం లేదు. దాంతో రైల్వే ట్రాక్‌ల నిర్వహణ లోపభూయిష్టంగా మారి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేధిస్తున్న నిర్వహణ వ్యయంతో కోత రైళ్లు పట్టాలు తప్పి.. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ప్రమాదాలు సంభవించడానికి 24 రకాల కారణాలు ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత, ట్రాక్‌ల నిర్వహణ ప్రమాణాల ఉల్లంఘన, రైల్వే కోచ్‌లు, వ్యాగన్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు అత్యంత ప్రధానమైనవి. కాగా.. రైల్వే శాఖ కొన్నేళ్లుగా రైల్వే ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత విధిస్తుండటం ఇటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది.2017–2021 వరకు రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదాల్లో 26 శాతం రైల్వే ట్రాక్‌ల నిర్వహణల లోపమే కారణమని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇంత జరుగుతున్నా రైల్వే శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత విధించడాన్ని కొనసాగిస్తోంది. ఏటా రైల్వే బడ్జెట్ పెరుగుతోంది కానీ.. అందులో ట్రాక్‌ల నిర్వహణ వ్యయం వాటాను మాత్రం తగ్గిస్తుండటం గమనార్హం. 2022–23 రైల్వే బడ్జెట్రూ.1.2 లక్షల కోట్లు కాగా.. అందులో రైల్వే ట్రాక్‌ల రెన్యువల్, నిర్వహణ కోసం 13.5 శాతం నిధులు కేటాయించారు. కాగా.. 2023–24 రైల్వే బడ్జెట్ 1.5 లక్షల కోట్లకు పెరిగినా అందులోనూ రైల్వే ట్రాక్‌ల రెన్యూవల్, నిర్వహణ నిధులను 11 శాతానికి తగ్గించడం గమనార్హం. గత వారం ప్రవేశపెట్టిన 2024–25 రైల్వే బడ్జెట్లో 1.8 లక్షల కోట్లు కేటాయించారు. కానీ,, రైల్వే ట్రాక్‌ల రెన్యువల్, నిర్వహణ నిధులను కేవలం 9.7 శాతానికే పరిమితం చేశారు. -
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి : ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతుండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటాపెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. 2019–20 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.17,385 కోట్లు ఉండగా, 2022–23 నాటికి పెన్షన్ల వ్యయం రూ.22,584 కోట్లకు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.. అంటే నాలుగేళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం 2019–20లో రూ.36,179 కోట్లు ఉండగా, 2022–23 నాటికి వేతనాల వ్యయం రూ.49,421 కోట్లు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది. -
Fact Check: అప్పులపై అబద్ధాల డప్పు..
సాక్షి, అమరావతి : చెప్పిందే చెప్పరా పాచిపళ్ల దాసరా.. అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ తీరు. తన ఆత్మబంధువు చంద్రబాబు మీద ఎక్కడలేని పిచ్చి ప్రేమ.. సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని అక్కసు, అసూయ, ద్వేషంతో ఆయన నిత్యం అసత్యాల వ్రతం చేస్తూ తన విషపుత్రిక ఈనాడులో అశుద్ధ కథనాలు వండివార్చడమే పనిగా పెట్టుకున్నారు. చెప్పిందే చెప్పి.. రాసిందే రాస్తూ జగన్‌పై తన కడుపుమంటను చాటుకుంటున్నారు. ఇందులో భాగమే తాజాగా ఆదివారం ఈనాడులో రామోజీ తన విలువల వలువలన్నీ విడిచేసి సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో ‘వారం వారం రుణ పురాణం’.. పేరుతో జగన్ సర్కారుపై మళ్లీమళ్లీ పిచ్చి ప్రేలాపనలు పేలారు. అనధికార అప్పులుండవని తెలిసినా.. నిజానికి.. ప్రభుత్వాలకు అనధికార అప్పులుండవని తెలిసినా సరే అనధికార అప్పులంటూ తన పాఠకులను రామోజీ ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే ప్రజలు నమ్ముతారనుకునే చంద్రబాబు సిద్ధాంతాన్ని రామోజీ తూచా తప్పకుండా పాటిస్తూ అబద్ధాలను అచ్చేస్తున్నారు. చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి పేరుతో అనధికారికంగా డిపాజిట్లు సేకరించడం ఈనాడు రామోజీకి చెల్లుతుంది తప్ప ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వానికి గానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అనధికార అప్పులనేవి ఉండనే ఉండవు. ఈ విషయం తెలిసినా సరే రామోజీ పదేపదే జగన్ సర్కారుపై విషప్రచారానికి తెగబడుతూనే ఉన్నారు. ఆయన తాజా కథనంలో అక్కసు, కక్ష, అసూయ తప్ప ఒక్క వాస్తవం కూడా లేదు. గత చంద్రబాబు హయాం నుంచి రాష్ట్రాల అప్పులకు ఏ నెలలో ఏ తేదీన సెక్యురిటీల విక్రయం చేయాలనేది ఆర్బీఐ నిర్ణయిస్తోంది. అందుకనుగుణంగా గత చంద్రబాబు ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీనెలా ఆయా తేదీల్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పులు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వారం వారం జగన్ సర్కారు ఒక్కటే అప్పులు చేయడంలేదు. ఇక మంగళవారం ఏపీతో సహా మొత్తం 13 రాష్ట్రాలు రూ.24,280 కోట్ల మేర అప్పులు చేయనున్నాయి. దాన్ని వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మంగళవారం రూ.1,100 కోట్లు అప్పు చేస్తోందంటూ ఈనాడు రామోజీ చేతికొచ్చింది ఇష్టారాజ్యంగా రాసిపారేశారు. తప్పుడు రాతలు.. దొంగ లెక్కలు.. నిజానికి.. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఏప్రిల్ 5న, ఏప్రిల్ 30న ఏకంగా రూ.5,500 కోట్లు అప్పుచేశారు. ఆ అప్పు కూడా 16 నుంచి 20 ఏళ్లలో తీర్చేలా చేశారు. ఇది ఈనాడు రామోజీకి తప్పుగా కనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే రామోజీకి ఎక్కడలేని ప్రేమ. ఇప్పుడు జగన్ అంటే నచ్చదు కాబట్టి నిబంధనల మేరకు అప్పులు చేస్తున్నా తప్పుగా కనిపిస్తాయి. రాష్ట్ర రుణాల మొత్తం, వడ్డీలు కలిపి చెల్లింపు భారం రూ.10 లక్షల కోట్లకు చేరిందంటూ పచ్చి అబద్ధాలను రామోజీ గుడ్డిగా అచ్చేశారు. దానికి కార్పొరేషన్ అప్పులను కూడా కలిపితే ఇలా ఉండవచ్చు అంటూ సొంత పైత్యాన్ని జోడించారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి భవిష్యత్తు చెల్లింపుల భారం గురించి కాగ్ నివేదికలో వాస్తవాలున్నా సరే అనధికారం, అంచనాల పేరుతో రామోజీ ఊహాగాన అంకెలతో నిస్సిగ్గుగా అచ్చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను కూడా ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుస్తోంది. ఇదే విషయాన్ని కాగ్ చెప్పినా ఆయనకు కనిపించదు. ఎందుకంటే అది చంద్రబాబుకు ఇబ్బంది కాబట్టి. 2019 మార్చి 31 నాటికి చేసిన అప్పుల్లో వచ్చే ఏడేళ్లలో రూ,1,03,550 కోట్లు అంటే 53.51 శాతం చెల్లించాల్సి వస్తుందని కాగ్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఇంత మొత్తంలో చెల్లింపుల భారం ఉన్నందున అందుకు తగిన ప్రణాళికతో అదనపు రెవెన్యూ వనరులను సమీకరించుకోవాల్సి ఉందని, లేదంటే అభివృద్ధికి నిధులుండవని కాగ్ పేర్కొంది. వాస్తవాలిలా ఉంటే.. ఈనాడు రామోజీ జగన్ సర్కారుపై ఈర‡్ష్యతో అవాస్తవ గణాంకాలతో విషప్రచారానికి తెగబడుతున్నారు. 2022 మార్చి వరకు కాగ్ ఇచ్చిన నివేదికలో కూడా వచ్చే పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అసలు అప్పులు, వడ్డీ కలిపి రూ.3.36 లక్షల కోట్లు మాత్రమే ఉందని కాగ్ స్పష్టంచేసినా, చెల్లింపుల భారం రూ.పది లక్షల కోట్లకు పెరిగిదంటూ రామోజీ పచ్చి అబద్ధాలతో పేట్రేగిపోయారు. వడ్డీ శాతంపైనా వంకర రాతలు.. ఇక 2017–18 చంద్రబాబు హయాంలో రాష్ట్ర అప్పులపై సగటు వడ్డీ 6.52 శాతం ఉందని, అదే 2021–22లో అప్పులపై సగటు వడ్డీ 6.15 శాతమేనని కాగ్ నివేదిక స్పష్టంచేసింది. అయినా సరే.. రామోజీ ఈ వాస్తవాలను పట్టించుకోకుండా సొంత గణాంకాలతో జగన్ సర్కారుపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. మూలధన వ్యయం కూడా గత చంద్రబాబు ఐదేళ్లలో కన్నా ఇప్పటి జగన్ సర్కారులో ఎక్కువగా ఉన్నప్పటికీ తప్పుడు గణాంకాలను ఈనాడు రాసింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు మూలధన వ్యయం రూ.15,227.80 కోట్లు ఉండగా.. వైఎస్ జగన్ సర్కారులో అది రూ.17,991.21 కోట్లుగా ఉంది. ఇక రెవెన్యూ రాబడులు కూడా పెరగడం లేదంటూ రామోజీ మరో అబద్ధాన్ని రంగరించారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది. కోవిడ్ సంక్షోభం లేకున్నా బాబు హయాంలో రాబడి పెరగకపోయినా పెన్నెత్తని రామోజీ.. ఇప్పుడు కోవిడ్ సంక్షోభంలోనూ రాబడి పెరిగినా సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు.. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం బాండ్లు, బ్యాంకులు నుంచి 10.32 నుంచి 10.45 శాతం వరకు అధిక వడ్డీలతో అప్పులుచేసి రాష్ట్రంపై భారం మోపినా రామోజీ కిమ్మనలేదు. ఇప్పుడు జగన్ సర్కారు తక్కువ వడ్డీలకే అప్పులు పుడుతున్నా ఆయనకు తప్పుగా కనిపిస్తోంది. టీడీపీ అప్పులకు ఈ ఏడాది కట్టాల్సిన వడ్డీ రూ.17వేల కోట్లు.. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వడ్డీల చెల్లింపులకు కేటాయించిన రూ.28,6p73.71 కోట్లలో టీడీపీ హయాంలో చేసిన అప్పులకే రూ.17,142.71 కోట్లు కట్టాల్సి వస్తోంది. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు రూ.11,531 కోట్లే. వాస్తవాలిలా ఉంటే.. మొత్తం రూ.28,673.71 కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం తీసుకున్న అప్పులపైనే చెల్లిస్తున్నట్లు ఈనాడు వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం అందించింది. నిజానికి.. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైన గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాస్తవాలేమీ చెప్పకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులకే అసలు, వడ్డీలు రూ.10 లక్షల కోట్లు చెల్లించాలంటూ రామోజీ ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు. ఇవేవీ రామోజీకి కనిపించవా? రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ గగ్గోలు పెడుతున్న రామోజీకి వైఎస్ జగన్ సర్కారు కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, రెండు విమానాశ్రయాలు, అలాగే.. గ్రామాల్లో 15 వేల సచివాలయాలు, 10,778 రైతుభరోసా కేంద్రాలు, 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 542 అర్బన్ హెల్త్ క్లినిక్స్ కనిపించడంలేదా. వైద్య రంగంలో నాడు–నేడు పేరుతో 16 వేల కోట్లతో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, మనబడి నాడు–నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో 16 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కనిపించడంలేదా? చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీగానీ, ఒక్క ప్రభుత్వ ఆస్పత్రిగానీ కట్టకపోయినా రామోజీ కళ్లకు అప్పుడంతా లేని అభివృద్ధి కలర్ఫుల్గా కనిపించింది. ఎందుకంటే బాబు అంటే ఇష్టం.. జగన్ అంటే కోపం. -
4 నెలల్లో నాలుగో వంతు రాబడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నాలుగు నెలల్లో నాలుగో వంతు రాబడులు వచ్చాయి. ఈ ఏడాదికి మొత్తం రూ.2.58 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించగా జూలై నెల ముగిసే నాటికి రూ.67,494.73 కోట్ల మేర ఖజానాకు ఆదాయం సమకూరిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తం బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇది 26 శాతం అన్నమాట. ఇందులో పన్నుల వాటా కింద రూ.42,712.27 కోట్లు వచ్చింది. ఆ తర్వాత అప్పుల పద్దు కింద కూడా ఎక్కువ సమకూరింది. ఈ ఏడాది బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా రూ.38,234 కోట్లు సేకరించాలన్నది అంచనా కాగా, అందులో దాదాపు 54 శాతం ఇప్పటికే సమకూరింది. 2023 జూలై నాటికి రూ.20,637.23 కోట్లు అప్పుల ద్వారా సేకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు పంపిన నివేదికలో వెల్లడించింది. మొత్తం రాబడుల్లో అప్పులే 30 శాతం ఉండడం గమనార్హం. ఇక పన్నుల ఆదాయంలో ఎక్కువగా జీఎస్టీ నుంచి రూ.15 వేల కోట్లకు పైగా వచ్చింది. మొత్తం అంచనాల్లో ఇది కూడా 30 శాతం దాటింది. ఎక్సైజ్ రాబడులు కూడా 30 శాతం దాటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నుల్లో వాటా కలిపి రూ.6,300 కోట్లకు పైగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై నాటికి రాబడులు 3 శాతానికి పైగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. -
సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి
సాక్షి, అమరావతి: కోవిడ్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్సార్ సీపీ పాలనలో సంపద పెరగడంతోపాటు అప్పులు తగ్గాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గణాంకాలతో సహా మీడియాకు గురువారం వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రి, కాగ్ చెప్పినవి వాస్తవాలని తెలిపారు. కొందరు స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లు అంటూ చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదన్నారు. ఎల్లో మీడియా, విపక్షాల మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులపై పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కలు, అసెంబ్లీలో సీఎం వెల్లడించిన గణాంకాలు మాత్రమే వాస్తవాలన్నారు. రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఇంత తక్కువ ఎలా చెబుతారంటూ ఎల్లో మీడియాతో పాటు విపక్ష నేతలు బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. కేరళను అప్పులకు అనుమతించకుండా ఏపీకి మాత్రం ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు ప్రచురించడం విచిత్రంగా ఉందన్నారు. ♦ గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎల్లో మీడియా ఏనాడైనా కథనాలు ప్రచురించిందా? ఇప్పుడు రూ.వెయ్యి కోట్ల అప్పులపై ఐదుసార్లు వార్తలు రాసి రూ.ఐదు వేల కోట్ల అప్పుల తరహాలో చిత్రీకరిస్తోంది. బడ్జెట్ బయట చూసినా లోపల చూసినా అప్పులు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఆయన హయాంలో పరిమితికి మించి రూ.16,418 కోట్లు అప్పులు చేయడంతో ఇప్పుడు ఆ మేరకు కోత పడింది. అనుమతి ఉన్నా సరే మేం రూ.28,466 కోట్లు తక్కువ అప్పులు చేశాం. ♦ చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం కాగా ఇప్పుడు 12.4 శాతం మాత్రమే ఉంది. మేం అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు ఎటు వెళ్లినట్లు? టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగలేదు కానీ అప్పులు మాత్రం పెరిగాయి. తాను సంపద పెంచే నిపుణుడినంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. కర్నాటక, తమిళనాడుతో పాటు వైఎస్సార్సీపీ పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టోలను ప్రకటించుకున్నారు. ♦ గత ఎన్నికల ముందు ఏప్రిల్‌లో పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు రూ.5,500 కోట్లు అప్పు చేయలేదా? వచ్చే ప్రభుత్వం పాలన చేయలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేరు. ఇక అప్పులు పుట్టకుండా చేశామంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించలేదా? అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏ సంక్షేమ పథకాన్నీ ఆపకుండా నిర్విఘ్నంగా అమలు చేస్తోంది. పరిమితికి లోబడే అప్పులు చేస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు పార్లమెంట్‌లోనూ ప్రశి్నంచారు. కేంద్రం వాస్తవాలను వెల్లడించడంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలకు దిక్కు తోచట్లేదు. ♦ దేశంలో రాష్ట్రానికో నిబంధన ఉండదు. పరిమితికి లోబడి కేంద్రం అప్పులను అనుమతిస్తోంది. ♦ రాష్ట్ర అప్పులపై మాట్లాడుతున్న వారు, కథనాలను ప్రచురిస్తున్న వారు అసలు మన రాష్ట్రంలోనే ఉండరు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ అప్పుల గురించి దు్రష్పచారం చేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు అప్పులు చేస్తే ఇప్పుడు రూ.10 వేల కోట్లు మాత్రమే అప్పు చేశాం. విద్యుత్ సంస్థలకు భారీగా పెట్టిన బకాయిలను సైతం తీరుస్తున్నాం. రెవెన్యూ రాబడులు, వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధిని గమనిస్తే సంపద ఎవరి హయాంలో ఎంత పెరిగిందో స్పష్టమవుతుంది. ♦ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ వయసులో తాను కొదమ సింహం అంటూ జంతువులతో పోల్చుకోవడం ఎందుకు? సింహం అంటే సింగిల్‌గా వస్తుంది. మరి ఆయన ఎప్పుడైనా సింగిల్‌గా పోటీ చేశారా? చంద్రబాబు పొత్తులు పెట్టుకోని పార్టీ లేదు. ఒకే పారీ్టతో రెండేసి సార్లు పొత్తులు పెట్టుకున్న ఘనత ఆయనదే. ♦ కొత్తగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించినవారు ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు అంటే ఏమిటో అధ్యయనం చేశాక మాట్లాడాలి. నాబార్డు నుంచి రూ.7,992 కోట్లు అప్పులు చేయలేదు. తీసుకున్నది రూ.3,281 కోట్లు మాత్రమే. కంటిన్జెన్సీ ఫండ్ గవర్నర్ వద్ద అత్యవసరాల కోసం ఉంటుంది. కొత్తగా వచి్చన వారు దాన్ని కూడా అప్పు కింద లెక్కించారు. పబ్లిక్ అకౌంట్ పద్దు నుంచి గత ప్రభుత్వం రూ.36,241 కోట్లు వాడుకోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3,475 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్సార్ హయాంతోపాటు విభజన అనంతరం మరోసారి టీడీపీ పాలనలో, వైఎస్సార్సీపీ వచ్చాక బడ్జెట్ బయట, లోపల చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వడ్డీల శాతం గణాంకాలను బుగ్గన వెల్లడించారు. ఆ వివరాలివీ... ♦ 2014–15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,22,605 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 23.35 శాతం) ♦ 2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 30.27 శాతం) ♦ 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.5 శాతం) ♦ చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికిపైగా పెరగగా ఇప్పుడు నాలుగేళ్లల్లో మూడు శాతం మాత్రమే పెరిగాయి. ♦ 2014 – 2019 అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం ♦ 2019 నుంచి 2022–23 వరకు అప్పుల వార్షిక వృద్ధి రేటు 12.4 శాతం ♦ చంద్రబాబు హయాం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధి రెండు శాతం తక్కువగానే ఉంది ♦ 1999 – 2004 రెవెన్యూ రాబడులు వృద్ధి 12.4 శాతం (ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాం) ♦ 2004 – 2009 రెవెన్యూ రాబడులు వృద్ధి 21.6 శాతం (వైఎస్సార్ హయాం) ♦ 2014 – 2019 రెవెన్యూ రాబడులు వృద్ధి 6 శాతం ♦ 2019 – 2023 రెవెన్యూ రాబడులు వృద్ధి 16.7 శాతం ♦ వైఎస్సార్ హయాంతో పోలిస్తే చంద్రబాబు జమానాలో రెవెన్యూ రాబడులు 15.6 శాతం క్షీణించగా ఇప్పుడు 10.7 శాతం పెరిగాయి ♦ 2014 – 2019 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,95,000 కోట్లు ♦ 2019 – 2023 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11,00,000 కోట్లు ♦ రాష్ట్ర విభజన నాటికి గ్యారెంటీలు, గ్యారెంటీలు ఇవ్వని అప్పులు రూ.35,000 కోట్లు ♦ 2019 మే నాటికి ఆ అప్పులను చంద్రబాబు రూ.1,40,500 కోట్లకు పెంచారు. అంటే 21.8 శాతం పెంచారు. ♦ వైఎస్సార్సీపీ వచ్చాక రూ.2,09,000 కోట్లకు పెరిగాయి. అంటే 12.6 శాతమే పెరిగాయి. -
భవిష్యత్‌లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆడిటింగ్‌లో మరింత పటిష్టమైన, శాస్త్రీయమైన పద్ధతులను పాటించాలని ఆడిటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కారాలను కనుగొనడంలోనూ ఆడిటింగ్ కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తొలి ఆడిట్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపారు. పారదర్శకత ఒకప్పుడు దేశీయంగా ఆడిట్ అంటే ఒకింత అనుమానంగా, భయంగాను చూసేవారని, కాగ్.. ప్రభుత్వం ఒకదానితో మరొకటి తలపడినట్లుగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం మైండ్‌సెట్ మారిందన్నారు. విలువ జోడింపులో ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందన్న భావన నెలకొందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వం పాటించిన తప్పుడు విధానాలు, పారదర్శకత లేకపోవడం వల్లే బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ‘గతంలో ఎన్పీఏలను ఎలా దాచిపెట్టేవారో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు చేసిన పనులను మేం పూర్తి నిజాయితీతో దేశ ప్రజల ముందు ఉంచాము. సమస్యలను గుర్తించినప్పుడే వాటికి పరిష్కార మార్గాలను కనుగొనగలము. వ్యవస్థలో పారదర్శకత తెచ్చిన తర్వాత ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి‘ అని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. డేటా కీలకం.. గతంలో సమాచారాన్ని కథల రూపంలో చెప్పేవారని, చరిత్రను కూడా కథల రూపంలోనే రాశారని మోదీ చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, సమాచారం అంటే డేటాయేనని ఆయన పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో సమాచారం అంటే డేటా. భావి తరాల్లో మన చరిత్రను డేటా ద్వారానే చూస్తారు. దాని కోణంలోనే అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో చరిత్రను డేటానే నిర్దేశిస్తుంది‘ అని మోదీ తెలిపారు. కాగ్ అడిగే డేటా, ఫైళ్లను ప్రభుత్వ విభాగాలు విధిగా అందజేయాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయి ఆడిట్లు నిర్వహించడానికి ముందు ప్రాథమికంగా బైటపడిన అంశాల గురించి ఆయా ప్రభుత్వ విభాగాలకు తెలియజేసేలా కాగ్ కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని మోదీ చెప్పారు. మరోవైపు, తొలి ఆడిటర్ జనరల్ 1860 నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారని, అందుకే ఆ రోజును ఆడిట్ దివస్‌గా నిర్వహించాలని భావించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. కొత్త ఆడిట్ ప్రక్రియ మేనేజ్మెంట్ అప్లికేషన్‌ను కాగ్ అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. చదవండి:బ్యాంకులకు ఆర్బీఐ షాక్ ! -
అందుకే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయట్లేదు
అమరావతి : కాగ్ రిపోర్టుకు భయపడే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఏపీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..‘ 2014-15లో రూ. లక్ష 75 వేల కోట్ల అప్పులు చేశారు. ఇక 2015-16 లో 2 లక్షల కోట్ల అప్పు దాటారు. ఎఫ్ఆర్బీఎం ప్రకారం 3 శాతానికి మించరాదన్న మీరు(చంద్రబాబు నాయుడు) అంతకు రెండింతలు అప్పులు చేశారు. 4 ఏళ్లలో 75 వేల కోట్లు రెవెన్యూ లోటు. ఇంతింత అప్పులు అంటే మీరు ఏం చేస్తున్నట్లు ..డబ్బులు ఎక్కడ పోతున్నాయి. అలా అని కేంద్ర నిధులు రావటం లేదా అంటే బాగానే వస్తున్నాయి. 2014-15లో రూ.21,779 వేల కోట్లు. 2015-16 కేంద్రం నుంచి రూ.21, 927 కోట్ల నిధులు. 2017-18 రూ.23 346 వేల కోట్లు నిధులు వచ్చాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికంటే ఎక్కువగానే సెంట్రల్ గ్రాంట్స్ వచ్చాయి. అప్పు ఇచ్చేవాడు దొరికితే చాలు అన్నట్లు బ్రహ్మాండంగా అప్పులు చేస్తున్నారు’ అని చెప్పారు. ‘ కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నేను కడుతా అని రూ. 16 వేల కోట్లు ఉన్న అంచనా వ్యయ్యాన్ని రూ. 56 వేల కోట్లకి పెంచారు. సాధ్యం కాదని తెలిసి కూడా ఎందుకు పోలవరం కడతా అన్నారు. ముడుపుల కోసం కాకుండా రాజధాని కోసం కేంద్రమే భూమి, నిధులు ఇస్తామన్నా మీరే కడుతాం అన్నారు. సింగపూర్, జపాన్ మాదిరి కడతా అని దేశదేశాలు తిరిగి ఏం చేయలేకపోయారు. 2017-18కి లెక్కేస్తే రూ.2 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. ఇంతింత అప్పులు చేసి మీరు చేసింది ఏంటి వెలగపూడిలో 4 తాత్కాలిక భవనాలు కట్టడం తప్ప..అవి తాత్కాలికం అని కట్టారు వర్షం పడితే నీరు కారుతాయి. ఎవరైనా దాని గురించి అడిగితే కళ్లు ఎర్రచేసి ఏం మాట్లాడుతున్నావంటూ విలేఖరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.’ అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి మా నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడితే మీకేం తెలుసు అన్నారు. యూపీ లాంటి జనాభా ఎక్కువ వున్న రాష్ట్రం కంటే హోదా ఉన్న రాష్ట్రాలకే నిధులు ఎక్కువ వస్తాయన్నా పట్టించుకోలేదు.ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో 16-17 % నిధులు వస్తున్నాయంటే బుల్డోజ్ చేశారు. ప్రత్యేక హోదా రాష్ట్రాలకే ఇన్సెంటీవ్లు వస్తాయని జగన్ మోహన్ రెడ్డి చెబితే ట్యూషన్ ట్యూషన్ అన్నారు. అంతా చెప్పి మీరు చేసింది ఏంటి రూ.90 వేల కోట్ల అప్పును రూ.2 లక్షల కోట్లకు దాటించారు. ఏమాత్రం సంబంధం లేకున్నా మీరు ఏపీలో ప్రతీ ఒక్కరి తలపై 30 వేల అప్పు మోపారు. ఏమన్నా ఉంటే నాకు ఉన్న అనుభవం , విజనరీ ఎవరికీ లేదంటారు. 2020 నాటికి దేశంలో మూడవ రాష్ట్రం, 2025, 2029 అంటున్నారు. ఎవరుంటారు సార్ అప్పటివరకు. మీకు అభివృద్ది కాదు మీ వంశానికి అధికారం కావాలి. మీరు విజనరీ కాదు ఔట్ డేటెడ్ అని గుర్తించండి’ అని అన్నారు. నిన్నటి వరకు మీతోనే ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్, బీజేపీ నేతలే మిమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పారు.మీ కుమారుడు లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తే ఇప్పటికీ సమాధానం లేదని, హోదా విషయంలో కూడా టీడీపీ నాయకత్వానికి, ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. -
అప్పులు.. తప్పులు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తప్పుడు పాలనతో రాష్ట్రం అప్పుల పాలవుతోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బడ్జెట్లో అంకెల గారడీ చేస్తూ.. అప్పులను ఆదాయంగా చూపుతూ.. మరిన్ని అప్పులు తెస్తూ.. అటు ప్రజలను, ఇటు రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించింది. లోటు బడ్జెట్‌ను మిగులు బడ్జెట్‌గా ఎక్కువ చేసి చూపడం వల్ల సంక్షేమ రంగాలు అన్యాయానికి గురవుతున్నాయని పేర్కొంది. ఈ అంకెల గారడీని కాగ్ లెక్కలతో సహా ఎండగట్టిందని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఏకంగా రూ.63,142 అప్పు పేరుకుపోయిందని లెక్కలు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌పై ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్)’ఆక్షేపించిన అంశాలతో ‘కాగ్ అద్దంలో కేసీఆర్ అబద్ధాలు’పేరిట టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం వరంగల్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగ్ పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తుర్పారబట్టారు. కేసీఆర్ ఇంటి విషయం కాదిది.. రాష్ట్ర బడ్జెట్ కేసీఆర్ ఇంటి విషయం కాదని, అది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయమని ఉత్తమ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులను ఆదాయంగా చూపుతున్న వైనంపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని.. ఇప్పుడు కాగ్ నివేదిక ఇదే నిజాన్ని బయటపెట్టిందని చెప్పారు. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం అప్పు రూ.61,711 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ. 1.80 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. దీనికి బ్యాంకులు, సంస్థల అప్పులను కలిపితే రూ. 2.21 లక్షల కోట్లకు చేరుతోందని చెప్పారు. ఈ లెక్కన తెలంగాణలో సగటున ప్రతివ్యక్తిపై రూ.63,142, ప్రతి కుటుంబంపై రూ.2.65లక్షలు, ఒక్కో గ్రామంపై రూ.21 కోట్లు, ఒక్కో మండలంపై రూ.370 కోట్లు, ఒక్కో జిల్లాపై రూ. 7,000 కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. అసలు రాష్ట్ర ఆదాయంలో మూడో వంతు అప్పులు, వడ్డీలు కట్టడానికే సరిపోతోందని ఉత్తమ్ చెప్పారు. ‘పరిమితి’నిబంధనను తుంగలో తొక్కి.. కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బడ్జెట్ లెక్కలను తారుమారు చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. ‘‘ఆర్థిక నిర్వహణ జవాబుదారీ చట్టం (ఎఫ్ఆర్బీఎం), 14 ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం... రాష్ట్ర జీఎస్డీపీ (స్థూల రాష్ట్రీయోత్పత్తి)లో మూడు శాతానికి మించి అప్పులు చేయరాదు. కానీ ఇక్కడ కావాలని మిగులు బడ్జెట్‌ను చూపిస్తూ 3.5 శాతం దాకా అప్పులు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందింది. వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకున్న అప్పులను కూడా కలిపితే ఈ మొత్తం 4.7 శాతానికి చేరుకుంటోంది. ఉదాహరణకు రాష్ట్ర ఆదాయం రూ.82,818 కోట్లు, వ్యయం రూ.81,432 కోట్లు, మిగులు రూ.386 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపించింది.. దీనిని పరిశీలించిన కాగ్ వాస్తవ ఆదాయం రూ.80,318 కోట్లు, ఖర్చు రూ.85,710 కోట్లు, లోటు రూ.5,392 కోట్లుగా తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం, కాగ్ లెక్కల్లో తేడా ఏకంగా రూ.6,778 కోట్లుగా ఉంది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాద సంకేతం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి..’’అని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సంక్షేమానికి కోతలు.. లోటు బడ్జెట్‌ను ఎక్కువ చేసి మిగులు బడ్జెట్‌గా చూపడం వల్ల సంక్షేమ రంగాలు అన్యాయానికి గురవుతున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్లో కేటాయిస్తున్న మొత్తాలకు, వాస్తవ వ్యయానికి పొంతనే ఉండటం లేదని... విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల కంటే తెలంగాణలోనే తక్కువని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు కేటాయిస్తూ.. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. నిధుల్లేక నాలుగు వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఇంకా 45 శాతం బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం లో నాలుగు లక్షల మంది దళితులకు భూము లు ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు 12,587 మందికే పంచారని చెప్పారు. గత నాలుగేళ్లలో అమరవీరుల సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో 71 శాతం, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌లకు 38.76శాతం, రోడ్లు–భవనాల శాఖకు 44.17 శాతం, పంచాయతీరాజ్‌కు 32.59 శాతం, పురపాలకశాఖకు 53.98 శాతం, బీసీ సంక్షేమ నిధులకు 41.8 శాతం కోత పెట్టారని వివరించారు. అ«ధిక రేటుకు విద్యుత్ కొనుగోళ్లతో రూ.5,528 కోట్లు, నాసిరకం బొగ్గు కొనుగోలుతో రూ.256 కోట్లు, అసమర్థ నిర్వహణ వల్ల రూ.789 కోట్లు నష్టం వాటిల్లినట్లు కాగ్ తేల్చిందని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం సాయం అందివ్వలేదని, గిట్టు బాటు« ధర కల్పించలేదని విమర్శించారు. తప్పుడు లెక్కలతో మోసం: జానారెడ్డి ఉద్దేశపూర్వకంగా బడ్జెట్లో తప్పుడు అంచనాలు పెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని.. టీఆర్ఎస్ సర్కారు అప్పులను ఆదాయంగా చూపుతూ చివరికి నిధుల్లేక సంక్షేమ రంగానికి కోతలు పెడుతోందని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌పై కాగ్ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2016–17 బడ్జెట్‌పైనే కాగ్ నివేదిక వచ్చిందని, 2017–18 నివేదిక వస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఇక అప్పును ఆదాయంగా చూపించడం, కరెంటును కొంటూ ఉత్పత్తిగా చూపించడం నేరమని.. ఇలాంటి తప్పుడు లెక్కలతో బడ్జెట్ రూపొందించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. అభివృద్ధి కోసం అప్పులు చేస్తే తప్పు కాదని.. ఆడంబరాలు, కమీషన్ల కోసం అప్పులు చేయడం సామాజిక నేరమని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపకర్త, కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, పొన్నం ప్రభాకర్, నంది ఎల్లయ్య, బలరాం నాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, బండ కార్తీక, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. -
టెల్కోలకు ట్రాయ్ నోటీసులు!
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూ.2,578 కోట్ల మేర వసూలు చేసుకునేందుకు గాను ఐదు టెలికం సంస్థలకు నోటీసులు జారీ చేయనుంది. టాటా టెలీ సర్వీసెస్, టెలినార్, వీడియోకాన్ టెలికామ్, క్వాడ్రంట్ (వీడియోకాన్ గ్రూపు సంస్థ), రిలయన్స్ జియో తమ ఆదాయాలను రూ.14,800 కోట్ల మేర తక్కువ చేసి చూపడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,578 కోట్ల మేర ఆదాయం తక్కువగా వచ్చిదంటూ క్రంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఇవ్వగా, ఇది డిసెంబర్ 19న పార్లమెంటు ముందుకు చేరిన విషయం తెలిసిందే. లైసెన్స్ ఫీజు రూపంలో రూ.1,015 కోట్ల మేర తక్కువగా, స్పెక్ట్రమ్ వినియోగ ఫీజు రూ.511 కోట్ల మేర, ఆలస్యంగా చేసిన చెల్లింపులపై రూ.1,052 కోట్ల మేర వడ్డీ టెలికం సంస్థలు ప్రభుత్వానికి తక్కువగా చెల్లించాయన్నది నివేదిక సారాంశం. ఈ నేపథ్యంలో తగ్గిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఆయా టెలికం సంస్థలకు ట్రాయ్ డిమాండ్ నోటీసులు జారీ చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
వరదొస్తే... వణుకుడే!
భారతదేశ మొత్తం భూభాగంలో వరదలకు గురయ్యే ప్రాంతం దాదాపు 14 శాతం. ఇందులో 15 శాతం కంటే ఎక్కువ ప్రాంతంలో ప్రతి ఏటా వరదలు సంభవిస్తూనే ఉన్నాయి. 1953 నుంచి 2016 వరకూ దేశంలో వరదల బారిన పడి ప్రతి ఏడాది సగటున 1,626 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వరదల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా కలుగుతున్న నష్టం సగటున రూ.4,282 కోట్లు. ఈ విషయాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆఫ్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఇక 2007 ఏప్రిల్ నుంచి 2016 మార్చి మధ్యలో వరదల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 61 శాతం ఇప్పటికీ విడుదల కాలేదని పేర్కొంది. ఇదే కాలంలో కేంద్రం ఆమోదించిన 517 పనులు ఇప్పటికీ పూర్తికాలేదని తేల్చింది. – సాక్షి, తెలంగాణ డెస్క్ 17 రాష్ట్రాల్లో అధ్యయనం.. 2007–08 నుంచి 2015–16 మధ్య 206 వరద నిర్వహణ కార్యక్రమాలు, 38 వరద హెచ్చరిక స్టేషన్లు, 49 నదీ నిర్వహణ కార్యకలాపాలు, సరిహద్దు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు, 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 68 భారీ డ్యామ్‌లు మొదలైన వాటిపై కాగ్ అధ్యయనం చేసింది. ఈ 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎనిమిది రాష్ట్రాల్లో చేపట్టిన వరద నిర్వహణ కార్యక్రమాలను సరైన పద్ధతిలో నిర్వహించడం లేదని తన నివేదికలో కాగ్ వెల్లడైంది. ఈ పనులు పూర్తికావడానికి 10 నెలలు మొదలుకుని 13 ఏళ్ల వరకూ ఆలస్యం జరుగుతున్నట్టు తేల్చింది. నిధులు విడుదలయ్యే నాటికి టెక్నికల్ డిజైన్లు ఉపయోగించలేని స్థితికి చేరుతుండటమే ఆలస్యానికి కారణమని నివేదిక పేర్కొంది. భారత్‌కు ముప్పు ఇలా.. భారత భూభాగంలో 14 శాతం లేదా 45.64 మిలియన్ హెక్టార్ల ప్రాంతం వరదలకు గురవుతూ ఉంటుందని కాగ్ నివేదిక పేర్కొంది. వరద ప్రభావానికి గురయ్యే మొత్తం ప్రాంతంలో 16 శాతం లేదా 7.55 మిలియన్ హెక్టార్లలో ఏటా వరదలు సంభవిస్తున్నాయి. 1996 నుంచి 2015 మధ్య ప్రకృతి విపత్తుల వల్ల సంభవిస్తున్న మరణాల్లో ప్రపంచంలోనే మన దేశం ఐదో స్థానంలో ఉంది. ఈ కాలంలో ప్రకృతి విపత్తుల వల్ల 97,691 మరణాలు సంభవిస్తే అందులో మూడో వంతు అంటే 35,325 లేదా 36.1 శాతం వరదల వల్ల కలిగినవే. దేశంలో పెరిగిన మరణాల సంఖ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణాల్లో హైతీ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటే.. ఇండోనేషియా, మయన్మార్, చైనా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(యూఎన్‌ఐఎస్‌డీఆర్) నివేదిక తెలిపింది. వరదల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాలు 2015కు ముందు పదేళ్ల కాలంలో ప్రతిసారి వరద వచ్చినప్పుడు మరణాల సంఖ్యను సగటున 34కు తగ్గించగలిగాయని యూఎన్‌ఐఎస్‌డీఆర్ నివేదిక తెలిపింది. అంతకుముందు పదేళ్ల కాలంలో ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మరణించేవారి సంఖ్య సగటున 68గా ఉంది. డ్యామ్‌ల నిర్మాణం, మెరుగైన హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేయడం తదితర కారణాల వల్లే మరణాల సంఖ్యను తగ్గించడం సాధ్యమైంది. అయితే మనదేశంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 1996–2015 మధ్య చైనాలో 182 సార్లు వరదలు వస్తే.. మనదేశంలో 167 సార్లు వరదలు సంభవించాయి. 1996–2005 మధ్య చైనాలో 14,400 మరణాలు సంభవిస్తే.. 2006–2015 మధ్య ఇది 6,600కు తగ్గింది. అదే భారత్ విషయానికి వస్తే 1996–2005 మధ్య 13,660 మంది మరణిస్తే.. 2006–2015 మధ్య ఇది కాస్త పెరిగి 15,860కి చేరింది. వరద నిర్వహణ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించకపోవడం.. పనుల్లో ఆలస్యం.. సరైన అంచనా వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ పరిస్థతి ఏర్పడిందని కాగ్ పేర్కొంది. -
దోచిపెట్టింది రూ.170 కోట్లు
అడ్డదారిలో గడువు పొడిగింపులు.. ‘లిక్విడేట్ డ్యామేజ్’ నిబంధనను అతిక్రమించి కోట్లకు కోట్లు చెల్లింపులు.. మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుని ఎనిదేళ్లు దాటినా పూర్తి చేయని నిర్లక్ష్యం...పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో ‘కాగ్’కు కనిపించిన అక్రమాలు..అవినీతి ఊటలు ఇవి..! సాక్షి ప్రతినిధి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువును ఇప్పటి వరకు 13 సార్లు పొడిగించడం పట్ల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని కోరినా.. సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వడానికి సాగునీటి శాఖ పాట్లు పడుతోంది. ప్రాజెక్టు పనులను దక్కించుకున్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ 2004 అక్టోబర్‌లో ఒప్పందం మీద సంతకాలు పెట్టింది. ఒప్పందం కుదిరిన తేదీ నుంచి 36 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు గడువు ఇచ్చారు. 36 నెలల గడువు ముగిసి 8 సంవత్సరాల 8 నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ఇంకా 90 శాతం పనులే పూర్తయ్యాయి. కనీసం పనుల ప్రగతి నివేదికను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను అడగడం లేదని ఆక్షేపించింది. ఈమేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), సాగునీటి శాఖ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. గడువు పొడిగిస్తే.. అదనపు చెల్లింపులకు అవకాశం లేదు.. గడువు పొడిగిస్తే.. కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని నిబంధనలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. గడువు పొడిగించిన వెంటనే కాంట్రాక్టర్‌కు ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధించాలి. ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధిస్తే.. ధరల సర్దుబాటు కింద అదనపు చెల్లింపులు అడిగే అర్హతను కాంట్రాక్టర్ కోల్పోతారు. అయితే ధరల సర్దుబాటు కింద ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.170 కోట్లు అదనంగా చెల్లించారు. అడ్డదారిలో గడువు పొడిగింపు గడువు పొడిగింపు ప్రతిపాదన క్షేత్రస్థాయి నుంచి రావాలి. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల వల్ల సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితులు ఏర్పడితే.. గడువు పొడిగించాలని క్షేత్రస్థాయి నుంచే ప్రతిపాదన వస్తుంది. పొడిగింపు ప్రతిపాదనపై హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) సంతకాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను ప్రభుత్వ పెద్దలు పక్కనబెట్టారు. ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధించాలని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిపాదనపై రాస్తే.. కాంట్రాక్టర్ రూ. వందల కోట్లు కోల్పోవాల్సి ఉంటుందని, కమీషన్లు కూడా రావనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు అలా చేస్తున్నారని సాగు నీటి శాఖ సిబ్బంది చెబుతున్నారు. పులిచింతల ముఖం చూడని ముఖ్యమంత్రి .... ప్రాజెక్టు వద్ద నిద్రపోతానని, ఇంజనీర్ల గుండెల్లో నిద్రపోతానని ప్రతి సమీక్షాసమావేశంలో రెండేళ్లుగా చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా పులిచింతల ప్రాజెక్టును సందర్శించకపోవడం గమనార్హం. ప్రాజెక్టు భద్రత లేమి, పనులు చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..ప్రస్తావనకు వస్తే.. కాంట్రాక్టర్‌కు అదనంగా కోట్లాదిరూపాయలు చెల్లించడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే సీఎం.. ప్రాజెక్టును సందర్శించలేదని ఇంజనీర్లు అంటున్నారు. నాలుగు డివిజన్లకు స్థాన చలనం పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ కోసం ఐదు డివిజన్లు, ఒక సర్కిల్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పని పూర్తి కాకుండానే నాలుగు డివిజన్లను పులిచింతల నుంచి తరలించారు. దీంతో ఒక డివిజన్లో ఉన్న సిబ్బంది పనుల పర్యవేక్షణకు సరిపోవడం లేదని, సిబ్బంది మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.