
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక ఐదు వేల కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్న మాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు పది శాతం నష్టం రావచ్చని భావిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం 20 శాతం రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఏపీనే కావడం విశేషం ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 43657 కోట్లు, రాజస్తాన్ 31285 కోట్లు, కేరళ 27709 కోట్లు, కర్ణాటక 19126 కోట్ల మేర అప్పులు చేశాయి.
గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం సగటున నెలకు 5500 కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియా వారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి ఈ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వారికి వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ అప్పుపై విచారణ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు, 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు మూడున్నర లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11వేల కోట్ల రుణం తీసుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక ఐదువేల కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్నమాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు పది శాతం నష్టం రావచ్చని భావిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం 20 శాతం రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఎపినే కావడం విశేషం ఏపీ తర్వాత మధ్యప్రేదశ్ 43657 కోట్లు, రాజస్తాన్ 31285 కోట్లు, కేరళ 27709 కోట్లు, కర్ణాటక 19126 కోట్ల మేర అప్పులు చేశాయి.
గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సగటున నెలకు 5500 కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు, ఎల్లో మీడియావారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్ధిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి ఈ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వారికి వంత పాడుతూ ఏపీ అప్పుపై విచారణ చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు, 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు మూడున్నర లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11వేల కోట్ల రుణం తీసుకుంటోంది.
ఈనాడు వంటి ఎల్లో మీడియా జగన్ హయాంలో అప్పు చేసినప్పుడల్లా అది ఎంత చిన్న మొత్తం అయినా, ఏపీ అప్పుల చిప్ప అయిపోయిందని, మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించేది. అలాగే వారి టీవీలలో విపరీతంగా ప్రసారం చేసేది. కాని అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే కేవలం 15 నెలల్లోనే దాదాపు రెండు లక్షల కోట్ల అప్పు చేసినా ఈ మీడియా కిమ్మనడం లేదు. పైగా దీనికి ఇదంతా రుణాల సమీకరణ అని ముద్దుపేరు పెట్టుకుని రాస్తున్నాయి. ప్రభుత్వం చూపించే లెక్కల ప్రకారం 1,17 లక్షల మొత్తం నిధుల రాష్ట్రానికి ఈ ఐదు నెలల్లో సమకూరితే అందులో సింహభాగం అప్పులే కావడం గమనార్హం. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాలు ప్రస్తుతం చేస్తున్న అప్పు గురించి నోరు ఎత్తడం లేదు. పైగా ఇప్పటికీ చంద్రబాబు ఆయా సభలలో జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని అసత్య ప్రచారం సాగిస్తున్నారు.
ఈ పరిస్థితిపై నెటిజన్లు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. జగన్ నెలకు 5500 కోట్లు అప్పు చేస్తే శ్రీలంక.. చంద్రబాబు నెలకు 11వేల కోట్ల అప్పు చేస్తే సింగపూర్ అయినట్లా అని వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ లో తెలిపిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తీసుకోదలచిన అప్పుల్లో మూడింట రెండు వంతుల మేర అప్పుడే ప్రభుత్వం తీసేసుకుందని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ టైమ్ నాటి 2023-34 ఐదు నెలలతో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 8752 కోట్ల రాబడి తగ్గిందని కాగ్ వెల్లడించింది. అలాగే అదే కాలానికి ప్రభుత్వం పెట్టే వ్యయంలో కూడా 10663 కోట్లు తగ్గిందని, దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై కనబడుతోందని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికి ,జగన్ టైమ్ నాటికన్నా, ఈ ఏడాది ఐదు నెలల్లో కేంద్రం నుంచి 16వేల కోట్ల ఆదాయం తక్కువ వచ్చిందని తేలుతోంది.
ఆదాయం ఆశించినంత రాక రెవెన్యూ లోటు, అప్పుల వల్ల ద్రవ్య లోటు తీవ్రంగా పెరుగుతున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఈ లెక్కలు గమనిస్తే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ ఆర్ధిక ఆరోగ్యం క్షీణించినట్లు కనబడుతుంది. రెవెన్యూ లోటులో దేశంలోనే నెంబర్ టు స్థానంలో ఏపీఉంది.మరో వైపు ప్రభుత్వం ఆయా రంగాలకు చెల్లించవలసిన బకాయిలు వేల కోట్లు ఉంటున్నాయి. ఉదాహరణకు ఒక్క ఆరోగ్యశ్రీ బకాయిలే 2700 కోట్లు అని స్వయంగా ఆ శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. చిన్న,మద్య తరగతి క ఆంట్రాక్టర్ లకు ఆరేడువేల కోట్లు చెల్లించవలసి ఉందని కదనాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 30వేల కోట్ల వరకు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. వీటితో పాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అనేకం నెరవేర్చలేదు. వాటిని అరకొరగా అయినా చేయాలంటే మరింత అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంది.
ఈ దశలోజీఎస్టీ కొత్త సంస్కరణలు రావడం రాష్ట్రాలకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. పైకి మాత్రం ఈ సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు చెబుతూ లోపల మాత్రం ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు. తెలంగాణలోజీఎస్టీ మార్పుల వల్ల నష్టం ఏడువేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు.ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుని భారాన్ని రాష్ట్రాలపై మోపిందని, ఇందుకు నష్ట పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏపీలో కూడా ఎనిమిదివేల కోట్లకుపైగా నష్టం ఉందని లెక్కలు కడుతున్నారు. అసలే రెవెన్యూ లోటుతో కింద, మీద పడుతున్న తరుణంలో ఈ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆయా అధికారిక సమావేశాలలో వివిధ శాఖల బడ్జెట్‌లలో కోత పెట్టడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలో ముందుగా విద్య, వైద్య రంగాలను బలి చేయడానికి సన్నద్ధం అవుతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ జగన్ టైమ్‌లో నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ది చేస్తే, ఇప్పుడు దానికి దాదాపు మంగళం పలికినట్లేనా అన్న సందేహం కలుగుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో విరాళాలు, ఆయా సంస్థల నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పడమే నిదర్శనంగా ఉంది. అలాగే సంజీవని కార్యక్రమం చేపట్టడం, ఇతర పద్దతుల ద్వారా ఆరోగ్య శాఖ బడ్జెట్ లో 30 శాతం తగ్గించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన ఆ మాట అన్నారంటే అధికారులకు పరోక్షంగా ఆ రకంగా కోతలు పెట్టమని చెప్పడమే కదా!. జీఎస్టీ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను గురించి వివరించాలని చంద్రబాబు శాసనసభలో చెప్పారు. దానివల్ల నిజంగా జనానికి ఎంత మేలు కలుగుతుందో కాని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కోతల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందేమోనన్న భయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
ఆర్థికంగా జీఎస్టీ సంస్కరణల వల్ల ఇబ్బందులు వస్తాయని ఆర్థిక మంత్రి, అధికారులు చెప్పినా, ప్రజా ప్రయోజనాల రీత్యా మద్దతు ఇవ్వాలని తాను తెలిపానని ఆయన అన్నారు. నిజానికి చంద్రబాబు వంటివారికి ఇవి నచ్చుతాయంటే అంతగా నమ్మలేం. గత అనుభవాలు ఈ విషయాన్ని చెబుతాయి. కాకపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, మోదీని ఈ మధ్య కాలంలో విపరీతంగా పొగుడుతున్న నేపథ్యంలో ఇంతకన్నా వేరే మార్గం చంద్రబాబుకు లేదన్న సంగతి బహిరంగ రహస్యమే. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా రాబడి తగ్గుతుండడంతో రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలు కూడా ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని శాసనసభలోనే ఆయన వ్యాఖ్యానించడం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఆరోగ్య బీమాపై పన్ను తీసివేసినందున రాష్ట్రానికి 800 కోట్లు ఆదా అవుతుందని ఆయన అన్నారు. బాగానే ఉంది.
అలాంటప్పుడు ఆరోగ్య శాఖ బడ్జెట్ 30 శాతం తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చెప్పారో తెలియదు. వ్యవసాయం ఖర్చు తగ్గి, రైతుల ఆదాయం పెరుగుతుందని చంద్రబాబు చెప్పేస్తున్నారు. ఒక పక్క తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, అల్లాడుతుంటే, వారికి ఆదాయం పెరుగుతుందని సీఎం అంటున్నారు. నిజంగా అలా జరిగితే సంతోషమే. కాని ఊహాజనిత అంశాల ఆధారంగా మాట్లాడితేనే సమస్య వస్తుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల కొన్నిటి ధరలు తగ్గి ప్రజలకు కొంత ప్రయోజనం ఉండవచ్చు. కాని దానితోనే ప్రజల జీవితంలో పెనుమార్పులు వస్తాయని అనుకుంటే మాత్రం అది అత్యాశే అవుతుంది. ఇప్పటికే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయని చెబుతున్నారు.
తద్వారా పన్ను రాయితీలు వచ్చినా, ప్రజలకు లభించేది పెద్దగా ఉండకపోవచ్చునని అంటున్నారు. మరో వైపు పోరాటా వంటి ఉత్తరాది ఆహార పదార్థాలకు పన్ను తీసి వేసి, ఇడ్లి, దోసె వంటి దక్షిణాది పదార్ధాలపై పన్నులు ఉంచడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. జీఎస్టీ రూపేణా ఇంతకాలం అధిక పన్నులు వసూలు చేసి, ఇప్పుడేదో తగ్గించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏతావాతా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కునే అవకాశం కనిపిస్తోందని చెప్పక తప్పదు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత