న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టయిన టాప్08 రియల్టీ కంపెనీల రుణ భారం గత మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. దీంతో మార్చితో ముగిసిన గతేడాది(2022-23)కల్లా ఉమ్మడిగా నికర రుణ భారం రూ. 23,000 కోట్లకు పరిమితమైంది. వెరసి 2019–20లో నమోదైన రూ. 40,000 కోట్లతో పోలిస్తే 43 శాతం క్షీణించింది. ఇందుకు ప్రధానంగా గృహ విక్రయాలు జోరందుకోవడంతో మెరుగుపడిన నగదు రాక(క్యాష్ ఫ్లో) ప్రభావం చూపినట్లు అనరాక్ పేర్కొంది. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా హౌసింగ్‌కు భారీస్థాయిలో డిమాండు కొనసాగుతోంది. ఇది దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన రియల్టీ రంగ దిగ్గజాలు రుణ భారాన్ని తగ్గించుకునేందుకు సహకరిస్తోంది. (ఎస్‌బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!)
రెసిడెన్షియల్‌పై దృష్టి
గృహ నిర్మాణం, అభివృద్ధి రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్-8 కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న అనరాక్ ఆర్థిక పనితీరును విశ్లేíÙంచింది. ఈ జాబితాలో డీఎఫ్‌ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్(లోధా), గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, శోభా లిమిటెడ్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, పుర్వంకారా, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఉన్నట్లు పేర్కొంది. లిస్టెడ్ రియల్టీ డెవలపర్స్ నికర రుణ భారం 2019–20లో రూ. 40,500 కోట్లుగా నమోదుకాగా.. 2022–23కల్లా రూ. 23,000 కోట్లకు క్షీణించింది. సగటు రుణ వ్యయాలు 10.3 శాతం(2020) నుంచి 9 శాతానికి(2023) తగ్గాయి. 2020–21లో వడ్డీ వ్యయాలు 9.05 శాతంగా నమోదుకాగా.. రుణ వ్యయాలు 2021–22లో 7.96 శాతానికి చేరాయి. అమ్మకాలు, ఆదాయం పుంజుకోవడంతో రియల్టీ దిగ్గజాల నికర రుణభారానికి చెక్ పడినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పురీ పేర్కొన్నారు.
కరోనా ముందుకంటే..
జాబితాలోని లిస్టెడ్ రియల్టీ కంపెనీల అమ్మకాల పరిమాణం కరోనా మహమ్మారి ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు అనుజ్ వెల్లడించారు. ఇవి కొత్త రికార్డు బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో నగదు రాక బలపడటంతో రుణ భారాన్ని భారీగా తగ్గించుకుంటున్నట్లు తెలియజేశారు. 2022 ఏప్రిల్ మొదలు వడ్డీ రేట్ల పెంపు రుణ వ్యయాలను నామమాత్రంగా పెంచినట్లు వివరించారు. భారీ కంపెనీలపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని తెలియజేశారు. ఫలితంగా 2016–17లో 17 శాతంగా ఉన్న అతిపెద్ద లిస్టెడ్, అన్‌లిస్టెడ్ డెవలపర్స్ మార్కెట్ వాటా 2022–23 కల్లా రెట్టింపై 36 శాతాన్ని తాకినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment