realty firm
-
‘హౌస్’ఫుల్ డిమాండ్!! రూ. 2,700 కోట్ల అపార్ట్మెంట్లు విక్రయం
గురుగ్రామ్‌లో కొత్తగా ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్టులో రూ.2,700 కోట్లకు పైగా విలువైన ప్రీమియం అపార్ట్మెంట్లను విక్రయించినట్లు రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ తెలిపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 71లో 'టైటానియం ఎస్పీఆర్' పేరుతో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సిగ్నేచర్ గ్లోబల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.విక్రయించాల్సిన అపార్ట్మెంట్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఆసక్తి వ్యక్తమవడంతో ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఆసక్తి వ్యక్తీకరణ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కేటాయింపు ప్రక్రియ ద్వారా రూ.2,700 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. కేటాయింపుల ప్రక్రియ ఖరారైన తర్వాత మొత్తం అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.సిగ్నేచర్ గ్లోబల్ ఈ కొత్త ప్రాజెక్టులో ఎన్ని హౌసింగ్ యూనిట్లను ప్రారంభించింది, వాటిలో ఇప్పటివరకు ఎన్ని విక్రయించింది వెల్లడించలేదు. ప్రీమియం ఫ్లాట్లను ఏ రేట్లకు విక్రయించిందో కూడా బహిరంగపరచలేదు. కంపెనీ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తుందని, మొదటిది 2.1 మిలియన్ చదరపు అడుగులు, రెండవది 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉందని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. -
లిస్టెడ్ రియల్టీల రుణాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టయిన టాప్08 రియల్టీ కంపెనీల రుణ భారం గత మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. దీంతో మార్చితో ముగిసిన గతేడాది(2022-23)కల్లా ఉమ్మడిగా నికర రుణ భారం రూ. 23,000 కోట్లకు పరిమితమైంది. వెరసి 2019–20లో నమోదైన రూ. 40,000 కోట్లతో పోలిస్తే 43 శాతం క్షీణించింది. ఇందుకు ప్రధానంగా గృహ విక్రయాలు జోరందుకోవడంతో మెరుగుపడిన నగదు రాక(క్యాష్ ఫ్లో) ప్రభావం చూపినట్లు అనరాక్ పేర్కొంది. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా హౌసింగ్‌కు భారీస్థాయిలో డిమాండు కొనసాగుతోంది. ఇది దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన రియల్టీ రంగ దిగ్గజాలు రుణ భారాన్ని తగ్గించుకునేందుకు సహకరిస్తోంది. (ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) రెసిడెన్షియల్పై దృష్టి గృహ నిర్మాణం, అభివృద్ధి రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్-8 కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న అనరాక్ ఆర్థిక పనితీరును విశ్లేíÙంచింది. ఈ జాబితాలో డీఎఫ్‌ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్(లోధా), గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, శోభా లిమిటెడ్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, పుర్వంకారా, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఉన్నట్లు పేర్కొంది. లిస్టెడ్ రియల్టీ డెవలపర్స్ నికర రుణ భారం 2019–20లో రూ. 40,500 కోట్లుగా నమోదుకాగా.. 2022–23కల్లా రూ. 23,000 కోట్లకు క్షీణించింది. సగటు రుణ వ్యయాలు 10.3 శాతం(2020) నుంచి 9 శాతానికి(2023) తగ్గాయి. 2020–21లో వడ్డీ వ్యయాలు 9.05 శాతంగా నమోదుకాగా.. రుణ వ్యయాలు 2021–22లో 7.96 శాతానికి చేరాయి. అమ్మకాలు, ఆదాయం పుంజుకోవడంతో రియల్టీ దిగ్గజాల నికర రుణభారానికి చెక్ పడినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పురీ పేర్కొన్నారు. కరోనా ముందుకంటే.. జాబితాలోని లిస్టెడ్ రియల్టీ కంపెనీల అమ్మకాల పరిమాణం కరోనా మహమ్మారి ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు అనుజ్ వెల్లడించారు. ఇవి కొత్త రికార్డు బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో నగదు రాక బలపడటంతో రుణ భారాన్ని భారీగా తగ్గించుకుంటున్నట్లు తెలియజేశారు. 2022 ఏప్రిల్ మొదలు వడ్డీ రేట్ల పెంపు రుణ వ్యయాలను నామమాత్రంగా పెంచినట్లు వివరించారు. భారీ కంపెనీలపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని తెలియజేశారు. ఫలితంగా 2016–17లో 17 శాతంగా ఉన్న అతిపెద్ద లిస్టెడ్, అన్‌లిస్టెడ్ డెవలపర్స్ మార్కెట్ వాటా 2022–23 కల్లా రెట్టింపై 36 శాతాన్ని తాకినట్లు వెల్లడించారు. -
వెల్డన్ ధోనీ.. మంచి పని చేశావు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శుక్రవారం రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి బ్రాండ్ అంబాసిడర్‌గా వైదొలగడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నోయిడాలోని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ బాధితులే కాకుండా సహచర టీమిండియా క్రికెటర్లు కూడా ధోనీ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. ఈ విషయంలో ధోనీకి స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. 'వెల్డన్ ధోనీ. అమ్రాపాలి బిల్డర్ బ్రాండ్ అంబాసిడర్ వైదొలిగావు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెటర్లకు విల్లాలు ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. కానీ ఇవ్వలేదు' అని భజ్జీ ట్వీట్ చేశారు. నోయిడాలోని అమ్రాపాలి రియల్టీ ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఎంతకూ పూర్తికాకపోవడంతో విసుగుచెందిన ఆ కాలనీ వాసులు ట్విట్టర్లో ఈ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. తమ సమస్యలు విన్నవించుకుంటూ.. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ధోనీ తీరును కూడా తప్పుబట్టారు. ఈ వివాదం నేపథ్యంలో ధోనీ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకొన్నాడు. Well done @msdhoni for dropping #Amarpali builders s brand ambassadorship..they didn't gave us VILLAS they announce after 2011 worldcup win — Harbhajan Singh (@harbhajan_singh) 16 April 2016 నోయిడా సెక్టర్ 45లోని అమ్రాపాలి 'షప్పైర్' ప్రాజెక్టులో 800 కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, తొలిదఫా ప్రాజెక్టులో ఇప్పటికీ విద్యుత్ సదుపాయం కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ వివాదంపై గతంలో స్పందించిన ధోనీ బిల్డర్‌తో మాట్లాడి.. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ధోనీ తప్పుకొన్నా.. సాక్షి కొనసాగుతోంది!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శుక్రవారం రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలికి గుడ్‌బై చెప్పాడు. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ పదవికి రాజీనామా చేశాడు. అయితే, ధోనీ భార్య సాక్షి మాత్రం ఇప్పటికీ ఆ కంపెనీతో అనుబంధం కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అమ్రాపాలి మహి డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో సాక్షి డైరెక్టర్‌గా కొనసాగుతున్నట్టు ఆంగ్ల మీడియా ఒకటి వెల్లడించింది. నోయిడాలోని అమ్రాపాలి రియల్టీ ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఎంతకూ పూర్తికాకపోవడంతో విసుగుచెందిన ఆ కాలనీ వాసులు ట్విట్టర్లో ఈ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. తమ సమస్యలు విన్నవించుకుంటూ.. ధోనీ ఇకనైన ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం మానుకోవాలని వారు సూచించారు. ఈ అంశం ట్విట్టర్లో హల్చల్ చేసిన నేపథ్యంలో ధోనీ రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, జార్ఖండ్‌లో పలు స్వచ్ఛంద సేవా పనులు నిర్వహిస్తున్నట్టు చెప్తున్న అమ్రాపాలితో సాక్షి అనుబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. పెండింగ్ పనుల వివాదం నేపథ్యంలో ధోనీతో కలిసి తాము ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయన బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి వైదొలిగారని అమ్రాపాలి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వివాదంలో ధోనీని లాగడం దురదృష్టకమరని, అందుకే ఆయనను దూరంగా ఉండాల్సిందిగా తాము కోరామని పేర్కొంది. నోయిడా సెక్టర్ 45లోని అమ్రాపాలి 'షప్పైర్' ప్రాజెక్టులో 800 కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, తొలిదఫా ప్రాజెక్టులో ఇప్పటికీ విద్యుత్ సదుపాయం కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ వివాదంపై గతంలో స్పందించిన ధోనీ బిల్డర్‌తో మాట్లాడి.. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.