సాక్షి, అమరావతి: అప్పులు అప్పులు అంటూ ఆంధ్రప్రదేశ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన వారికి కేంద్రం ప్రటించిన నివేదిక చెంపపెట్టుగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తమిళనాడు అత్యధిక రుణ బకాయిలున్న రాష్ట్రంగా నిలిచింది.
2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర (స్టేట్ డెవలప్‌మెంట్ లోన్- ఎస్‌డీఎల్) బకాయిలు రూ.7.54 లక్షల కోట్లుగా ఉండగా, దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అప్పు రూ.7.10 లక్షల కోట్లకు చేరుకుందని పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా తెలిపారు. గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరాల్లో (2020 -2023) అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ కర్ణాటక, ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
సంఖ్య | రాష్ట్రం | తీసుకున్న అప్పు |
1 | తమిళనాడు | రూ.7.54 లక్షల కోట్లు |
2 | ఉత్తర ప్రదేశ్ | రూ.7.10 లక్షల కోట్లు |
3 | మహారాష్ట్ర | రూ.6.80 లక్షల కోట్లు |
4 | పశ్చిమ బెంగాల్ | రూ.6.08 లక్షల కోట్లు |
5 | రాజస్థాన్ | రూ.5.37 లక్షల కోట్లు |
6 | కర్ణాటక | రూ.5.35 లక్షల కోట్లు |
రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా మారాలని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లేనని ఆయన వివరించారు. ఈ వాస్తవాలను విస్మరించి 10 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం చేయడం దుర్మార్గం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.
లోక్‌సభలో ఖమ్మం బీఆర్ఎస్ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు సీతారామన్. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అప్పు ఉంటే 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లుగా ఉంది.
రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా పరివర్తన తెచ్చుకోవాలి. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లే. 10 లక్షల కోట్ల అప్పు… pic.twitter.com/t8pveEL21r
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2023
Comments
Please login to add a commentAdd a comment