Actual Figures Of Andhra Pradesh Economic Growth Rate, Debt - Sakshi
Sakshi News home page

ఇదీ నిజం.. నమ్మొద్దు విష ప్రచారం

Published Sat, Sep 17 2022 7:58 PM | Last Updated on Sun, Sep 18 2022 11:40 AM

Actual Figures Of Andhra Pradesh Economic Growth Rate, Debt - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నో విమర్శలకు సూటిగా, స్పష్టమైన సమాధానం చెప్పింది. అప్పులపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని నమ్మొద్దంటూ సవివరంగా, పూర్తి గణాంకాలతో తేటతెల్లంగా ప్రజల ముందుంచారు. ఎల్లో మీడియాతో కలిసి విపక్షాలు చేస్తోన్న విష ప్రచారం నమ్ముతారా? నిజాలను కళ్లకు కట్టినట్టు చూపించే గణాంకాలను నమ్ముతారా?

2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో వృద్ధి రేటు ఎంత?  2019 నుంచి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అభివృద్ధి ఎలా ఉంది? ఈ లెక్కలు మీరే చూడండి. 

2018-19    చంద్రబాబు పాలనలో     వృద్ధి రేటు 5.36%      ఏపీ ర్యాంకు 21

2019 -20     సీఎం జగన్‌ పాలనలో    వృద్ధి రేటు 6.89%      ఏపీ ర్యాంకు 6

కోవిడ్‌ సమయంలో విపత్కర పరిస్థితులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఆర్థికంగా అన్ని కష్టాలను తట్టుకుంది. వృద్ధి రేటులో నాలుగో స్థానానికి ఎదిగింది

2020 -21      వృద్ధి రేటు 0.08%      ఏపీ ర్యాంకు 4

2021 -22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఎదిగింది. వృద్ధి రేటులో అద్భుతంగా రాణించింది, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో నిలిచింది. 

2021 -22      వృద్ధి రేటు 11.43%      ఏపీ ర్యాంకు 1

2014 నుంచి 2019 వరకు అంటే చంద్రబాబు హయాంలో జాతీయ ఆదాయంలో రాష్ట్రం వాటా 4.45% మాత్రమే ఉండగా.. 2019 నుంచి అంటే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ వచ్చిన తర్వాత, ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు జాతీయ ఆదాయంలో ఏపీ వాటా 5% చేరింది.

అప్పులపై అసలు నిజం ఇది
విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.లక్షా 20వేల 556 కోట్లు ఉంటే దాన్ని చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే సమయానికి రూ.2లక్షల 69వేల 462 కోట్లకు తీసుకెళ్లారు. అంటే అప్పుల్లో అది 123.52% పెరుగుదల. 2019లో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చే నాటికి అప్పులు రూ.2లక్షల 69వేల 462 కోట్లు ఉంటే.. ప్రస్తుతం అది రూ.3కోట్ల 82లక్షల 165 కోట్లుగా ఉంది. అంటే సీఎం జగన్‌ హయాంలో అప్పులు పెరిగింది 41.83% మాత్రమే.

అప్పులపై కాగ్‌ చెప్పిన వాస్తవమిది
♦చంద్రబాబు హయాంలో ప్రభుత్వ గ్యారంటీతో వివిధ పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్‌లు చేసిన అప్పు రూ.14028 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే సమయానికి అది రూ.59257 కోట్లకు చేరింది. మొత్తమ్మీద అప్పుల శాతం 19.55 %
♦ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హయాంలో పీఎస్‌యూలు తీసుకున్న అప్పు 15.46% మాత్రమే

ఏపీ సర్కారుపై విషపు రాతలు రాస్తోన్న ఎల్లో మీడియా అసలు నిజాలు మాత్రం దాచిపెడుతోంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఏపీలో ఉందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఒక సారి కేంద్రం అప్పులు, వృద్ధి రేటు చూస్తే నిజాలు వెల్లడవుతాయి. ఈ లెక్కలు పార్లమెంటు సాక్షిగా కేంద్రం సమర్పించిన బడ్జెట్‌లో చెప్పినవే. 

♦ 2014-19 మధ్య కేంద్రం అప్పులు రూ.62లక్షల 42వేల 220 కోట్లు
♦ వృద్ధి రేటులో అప్పు శాతం  50.07%

♦ 2020-21 కల్లా కేంద్రం అప్పులు రూ.1 కోటీ 20లక్షల 79వేల 18 కోట్లు
♦ వృద్ధి రేటులో అప్పు శాతం 61%



కేంద్రం vs ఆంధ్రప్రదేశ్‌ .. అప్పుడెంత? ఇప్పుడెంత? మీరే గమనించండి

♦2014-19 మధ్య కేంద్రం అప్పులు 59.88% పెరిగితే అదే సమయంలో ఏపీలో సర్కారు నడిపించిన చంద్రబాబు అప్పుల శాతాన్ని ఏకంగా 123.52% పెంచేశారు.
♦2019 నుంచి మార్చి 31, 2022 వరకు కేంద్రం అప్పులు 43.8% పెరిగిన , అదే సమయంలో ఏపీ సర్కారు అప్పుల శాతం పెంపు 41.83% మాత్రమే

ఇదీ వాస్తవం
♦ 2018-19 మధ్య వడ్డీ, అప్పు కలిపి చంద్రబాబు సర్కారు చెల్లించింది రూ.28886 కోట్లు అయితే 2021-22 మధ్య సీఎం జగన్‌ చెల్లించింది రూ.36007 కోట్లు
♦ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, 2019 నుంచి కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వాటిని తట్టుకుని ఏపీని నిలబెట్టింది
♦ సీఎం జగన్‌ సర్కారు. సంక్షేమం, సంస్కరణలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను కరోనా నుంచి కాపాడుకున్నారు సీఎం జగన్‌.

పచ్చ ప్రచారం ఆపండి, నిజాలు చూడండి
♦ మూలధన వ్యయం విషయానికి వస్తే టిడిపి హయాంలో రాష్ట్రం సగటు రూ.15227 కోట్లు. అదే సీఎం జగన్‌ హయాంలో మూలధన వ్యయం రాష్ట్రం సగటు రూ.18362 కోట్లు. ఈ లెక్కలు దాచిపెట్టి రాష్ట్రం శ్రీలంకలా మారబోతుంటూ చొక్కాలు చించుకున్నారు విష ప్రచారం చేశారు.

కేంద్రం ఇచ్చిందెంత?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా చాలా కీలకమైన అంశం. 2015 నుంచి 2019 వరకు ఏ ఏడాది చూసినా 34.91% నుంచి 36.63% వరకు ఉంది. అంటే చంద్రబాబు సర్కారుకు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పన్నుల్లో వాటా ఇచ్చింది. సీఎం జగన్‌ హయాంలో అంటే 2019 నుంచి ఏ ఏడాది చూసినా 29.35% నుంచి 23.13% మధ్యలోనే కేంద్ర పన్నుల వాటా ఉంది. 15వ ఆర్థిక సంఘం 41% ఇవ్వాలని చెప్పినా అది ఆచరణలోకి రాలేదు.

అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ప్రజంటేషన్‌ pdf కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement