ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా అమెరికాకు గుర్తింపు ఉంది. అది అలా వృద్ధి చెందడానికి అప్పులు కూడా ఒక కారణం. ఏంటీ..ఆశ్చర్య పోతున్నారా? అవును..అమెరికా అప్పులతోనూ ఎదిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏటా ఆ దేశం కట్టే వడ్డీలే అందుకు నిదర్శనం. జూన్ 2024 లెక్కల ప్రకారం..దేశీయంగా వసూలైన వ్యక్తిగత ఆదాయపు పన్నులో 76 శాతం అంటే జాతీయ రుణాన్ని చెల్లించేందుకే వెచ్చిస్తోంది. ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్‌లు వెలిశాయి. వాటిని ధ్రువపరిచేలా ప్రముఖ వ్యాపారవేత్త ఇలొన్‌మస్క్ ‘అమెరికా దివాలా దిశగా ప్రయాణిస్తోంది’ అంటూ స్పందించారు. దాంతో ఈ ట్వీట్ మరింత వైరల్‌గా మారింది.
పెరుగుతున్న జాతీయ రుణం అమెరికాలో చాలా కాలంగా ప్రధాన సమస్యగా ఉంది. టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ ఈ విషయాన్ని గతంలోనూ చాలాసార్లు తెలిపారు. తాజాగా ‘అమెరికా దివాళా దిశగా వెళ్తోంది’ అంటూ పీటర్ స్టాంజ్ అనే వ్యక్తి అప్‌లోడ్ చేసిన పోస్ట్‌లోని వివరాలను ధ్రువపరుస్తూ స్పందించారు. అమెరికా వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లలో దాదాపు 76 శాతం జాతీయ రుణ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నట్లు పీటర్ చెప్పారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయేందుకు కారణం మాజీ అమెరికా అధ్యక్షులు ఫ్రాంక్లిన్ డీ రూజువెల్ట్, రిచర్డ్ నిక్సన్ అని అన్నారు.
1970 కాలంలో అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న రిచర్డ్ నిక్సన్ దేశీయ విధానాల కంటే విదేశీ వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఓటర్లు తమ సొంత ఆర్థిక స్థితిపైనే దృష్టి సారిస్తారని నమ్మాడు. అప్పటికే దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం తిరిగి తన ఎన్నికకు ముప్పుగా మారుతుందని గ్రహించాడు. దాంతో ‘న్యూ ఫెడరలిజం’ విధానాలు అమలు చేశాడు. అందులో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్లను ప్రతిపాదించాడు. ఫలితంగా అమెరికా అప్పులు మూటగట్టుకుంది. రూజ్‌వెల్ట్ అధ్యక్ష పదవిలో ఉన్నపుడు సంపన్నులపై పన్ను రేట్లను 79%కు పెంచారు. ధనవంతులు ఈ రేటును తగ్గించుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దాంతోపాటు అమెరికాలో ప్రైవేట్ పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా ఉద్యోగ కల్పన కుంటుపడింది. నిరుద్యోగం పెరిగింది.
America is headed for bankruptcy fyi https://t.co/O6FH5BK4aQ
— Elon Musk (@elonmusk) July 26, 2024
ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!
పీటర్ స్టాంజ్ ఎక్స్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోపై పీటర్ షిఫ్ అనే క్రిప్టో విమర్శకుడు స్పందించాడు. ‘అమెరికా అప్పులు అక్కడితో ఆగవు. త్వరలో ఫెడరల్ పన్ను ఆదాయంలో 100% రుణవడ్డీని చెల్లించడానికే వెచ్చిస్తారు. అన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు చేయాల్సిందే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం, అప్పులను పరిశీలిస్తోంది’ అన్నారు. జూన్ 2024లో యూఎస్ ప్రభుత్వం ట్రెజరీ సెక్యూరిటీలపై 140.238 బిలియన్ డాలర్లు (రూ.11 లక్షల కోట్లు) వడ్డీ చెల్లించింది. ప్రభుత్వం అదే నెలలో వ్యక్తిగత ఆదాయ పన్నుల రూపంలో 184.9 బిలియన్ డాలర్లు(రూ.15.4 లక్షల కోట్లు) వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment