భారత ఆర్థిక పరిస్థితిపై ఆర్‌బీఐ(RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్)నిల్వలు తగినంత ఉండడంతో పాటు వీదేశి అప్పులు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. అందుకే శ్రీలంక, పాకిస్తాన్‌లో ఉన్న సమస్యలు దేశంలో లేవని చెప్పారు. ఫారెక్స్ నిల్వల విషయంలో ఆ రెండు దేశాలు పూర్తిగా విఫలమయ్యాయని దీని కారణంగానే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు.
రేట్లను పెంచడం గురించి రాజన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఉందని, అది తగ్గించేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేటును పెంచిందన్నారు. ప్రపంచంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, త్వరలో భారత్‌లో కూడా తగ్గుతుందన్నారు. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం జూలై 22తో ముగిసిన వారానికి విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు 571.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2022 మార్చి చివరి నాటికి, భారతదేశం విదేశి రుణం $620.7 బిలియన్లకు చేరుకుంది.
జీడీపీ(GDP) నిష్పత్తికి విదేశీ రుణం 2021 మార్చి చివరి నాటికి 21.2 శాతం నుంచి 2022 మార్చి చివరి నాటికి 19.9 శాతానికి తగ్గింది. శ్రీలంకలో వద్ద ఫారెక్స్ నిల్వలు ఇటీవల $50 మిలియన్ల కంటే తక్కువగా పడిపోయాయి. తద్వారా దేశం విదేశీ రుణాలపై చెల్లింపులను నిలిపివేయవలసి వచ్చింది. పాకిస్థాన్‌లోనూ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ తాజా డేటా ప్రకారం, జూలై 22, 2022తో ముగిసిన వారానికి పాకిస్తాన్ ఫారెక్స్ నిల్వలు $754 మిలియన్లు తగ్గి $8.57 బిలియన్లకు చేరుకున్నాయి. పాలసీ
Comments
Please login to add a commentAdd a comment