న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై మాధబిపురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్‌లు సంయుక్తంగా హిండెన్ బర్గ్‌కు నోటీసులు జారీ చేశారు. భారత్ చట్టాల్ని ఉల్లంఘించి హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని, అందుకే ఈ షోకాజు నోటీసులు జారీచేసినట్లు ధవల్ బచ్ దంపతులు తెలిపారు.
హిండెన్ బర్గ్ ఆగస్ట్ 10న సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన ఆఫ్‌షోర్ సంస్థల్లో మాధబి పురికి, ఆమె భర్త ధవల్ బచ్ దంపతులకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తూ ట్వీట్ చేసింది.
SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them.
"The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024
ఆ ట్వీట్‌కు మాధబి పురి స్పందించారు. హిండెన్ బర్గ్ తమ వ్యక్తిగత పరువుకు భంగం కలిగేలా వ్యహరిస్తోందని మండిపడ్డారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్‌లో పేర్కొన్న ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం సెబీలో చేరడానికి రెండేళ్ల ముందు అంటే 2015లో జరిగిందని గుర్తు చేశారు.
ఆ ఫండ్స్‌లో తాము పెట్టుబడులు పెట్టడానికి కారణం..ఆ ఫండ్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్(సీఐఓ) అనిల్ అహుజా తన స్నేహితుడని ధవల్ బచ్ తెలిపారు. అనిల్ అహుజా నా చిన్న నాటి స్నేహితుడు. పైగా ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, 3ఐ గ్రూప్ పీఎల్‌సీ వంటి సంస్థల్లో పనిచేశారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment