ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.
ఇప్పుడు అదానీ సంస్థ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడింది. అప్పులు తగ్గించడం, కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడంతో ఇది సాధ్యమైందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
హిండెన్‌బర్గ్ సృష్టించిన పెనుతుపానుకు ఎదురొడ్డి నిలిచిన అదానీ ఎంటర్ ప్రైజెస్ విభిన్నమైన వ్యూహాన్ని ఎన్నుకొంది. దానిని పక్కాగా అమలు చేసి సఫలమైంది. అదానీ స్టాక్స్ వ్యాల్యూ పెరిగింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఈ రోజు (మే 24) 1.7% పెరిగి 3,445.05కి చేరుకుంది. ఫిబ్రవరి 2023లో పడిపోయినప్పటి నుండి దాదాపు మూడు రెట్లు పెరిగింది.
ఈ తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ తన సిమెంట్, కాపర్ వ్యాపారాలను మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అదానీ రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment