అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫిబ్రవరి 2న అదానీ స్టాక్‌ల విక్రయాలు అధికం కావడంతో కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాటి సంబంధిత లోయర్ సర్క్యూట్‌లకు పడిపోయాయి. ఈ ప్రకంపనలు నేపథ్యంలో గత వారం నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో దాదాపు రూ.7.44 లక్షల కోట్లు నష్టపోయింది.
సిటీ గ్రూప్ ఇంక్ (Citigroup Inc.) మార్జిన్ లోన్‌ల కోసం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల సెక్యూరిటీలను తాకట్టుగా స్వీకరించడాన్ని కూడా నిలిపివేసిందని బ్లూమ్‌బెర్గ్ నుంచి నివేదికలు వెలువడ్డాయి. దీనిని అనుసరించి అదానీ గ్రూప్ స్టాక్‌లపై చీకటి మేఘాలు చుట్టుముట్టాయి. దానికి తోడు, అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను ఆశ్చర్యకరంగా ఉపసంహరించుకుంటున్నట్లు నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 1 గంటకు అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీల షేర్ల పరిస్థితి
ఈ పరిణామాలు అదానీ సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫిబ్రవరి 2న ఉదయం 11.43 గంటలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 8.53 శాతం తగ్గి రూ.1,957.25 వద్ద ట్రేడవుతుండగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్ - అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్‌డిటివి కూడా వాటి సంబంధిత లోయర్ సర్క్యూట్‌లలోకి చేరుకున్నాయి.
చదవండి: వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త.. ఇకపై అది ఒక్కటి చాలు!
Comments
Please login to add a commentAdd a comment