Offshore companies
-
హిండెన్‌బర్గ్‌కు మాధబి పురి షోకాజు నోటీసులు
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై మాధబిపురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్‌లు సంయుక్తంగా హిండెన్ బర్గ్‌కు నోటీసులు జారీ చేశారు. భారత్ చట్టాల్ని ఉల్లంఘించి హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని, అందుకే ఈ షోకాజు నోటీసులు జారీచేసినట్లు ధవల్ బచ్ దంపతులు తెలిపారు. హిండెన్ బర్గ్ ఆగస్ట్ 10న సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన ఆఫ్‌షోర్ సంస్థల్లో మాధబి పురికి, ఆమె భర్త ధవల్ బచ్ దంపతులకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them."The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024 ఆ ట్వీట్‌కు మాధబి పురి స్పందించారు. హిండెన్ బర్గ్ తమ వ్యక్తిగత పరువుకు భంగం కలిగేలా వ్యహరిస్తోందని మండిపడ్డారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్‌లో పేర్కొన్న ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం సెబీలో చేరడానికి రెండేళ్ల ముందు అంటే 2015లో జరిగిందని గుర్తు చేశారు. ఆ ఫండ్స్‌లో తాము పెట్టుబడులు పెట్టడానికి కారణం..ఆ ఫండ్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్(సీఐఓ) అనిల్ అహుజా తన స్నేహితుడని ధవల్ బచ్ తెలిపారు. అనిల్ అహుజా నా చిన్న నాటి స్నేహితుడు. పైగా ఇన్వెస్ట్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, 3ఐ గ్రూప్ పీఎల్సీ వంటి సంస్థల్లో పనిచేశారు’ అని చెప్పారు. -
ఈక్విటీలపై మళ్లీ ఎఫ్‌పీఐల చూపు
న్యూఢిల్లీ: వరుసగా మూడు త్రైమాసికాలలో క్షీణిస్తూ వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు జులై–సెప్టెంబర్(క్యూ2)లో 8 శాతం పుంజుకున్నాయి. దీంతో దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 566 బిలియన్ డాలర్లను తాకింది. అంతకుముందు త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఇవి 523 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు మార్నింగ్‌స్టార్ నివేదిక వెల్లడించింది. ప్రపంచస్థాయిలో వేగంగా మారుతున్న స్థూలఆర్థిక పరిస్థితులు, సెంటిమెంట్లు, అవకాశాలు దేశీ ఈక్విటీ మార్కెట్లకు ఆకర్షణను తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం జనవరి–మార్చిలో ఇవి 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 అక్టోబర్–డిసెంబర్లో 654 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ2లో ఇవి 667 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా.. తాజా సమీక్షా కాలంలో దేశీ ఈక్వి టీ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ)లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల వాటా సైతం క్యూ1లో నమోదైన 16.95 శాతం నుంచి 16.97 శాతానికి బలపడింది. ఎఫ్‌పీఐల జాబితాలో ఎఫ్‌పీఐ విభాగంలో ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. వీటితోపాటు ఆఫ్‌షోర్ బీమా కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరిన్ వెల్త్‌ఫండ్స్ సైతం ఈ జాబితాలో నిలిచే సంగతి తెలిసిందే. ఈ ఏడాది(2022–23) క్యూ1లోనూ దేశీ ఈక్విటీలలో అమ్మకాల వెనకడుగు వేసిన ఎఫ్‌పీఐలు తిరిగి క్యూ2లో పెట్టుబడుల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! అయితే పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న విషయం విదితమే. మరోపక్క నెలల తరబడి కొనసాగుతున్న రష్యా– ఉక్రెయిన్ యుద్ధం సైతం ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొంది. ఇక చమురు ధరలు బలపడటం, రూపాయి క్షీణతతో దేశీయంగా పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు వంటి అందోళనల నేపథ్యంలో ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వివరించింది. ఇటీవల అమ్మకాలు ప్రస్తుత త్రైమాసికం(క్యూ2)లో తొలుత జులైలో 61.8 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఆగస్ట్‌లో ఏకంగా 6.44 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. అయితే తిరిగి సెప్టెంబర్‌లో అమ్మకాలు చేపట్టి 90.3 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందుకు ప్రధానంగా అంతర్జాతీయ అనిశ్చితులు కారణమైనట్లు మార్నింగ్ స్టార్ నివేదిక పేర్కొంది. ధరల కట్టడికి ఫెడ్ వేగవంత రేట్ల పెంపు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేసింది. డాలరుతో మారకంలో రూపాయి భారీ క్షీణత, యూఎస్ బాండ్ల ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు సైతం ఎఫ్‌పీఐల పెట్టుబడులను ప్రభావితం చేయగలవని వివరించింది. కాగా.. ఈ నెల(నవంబర్)లో ఎఫ్‌పీఐలు మళ్లీ భారీ పెట్టుబడులకు తెరతీయడం ప్రస్తావించదగ్గ అంశం. ఈ నెలలో ఇప్పటివరకూ 3.53 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను జత చేసుకున్నారు. ఫెడ్ వడ్డీ పెంపు చివరి దశకు చేరుకున్న అంచనాలు, యూఎస్‌లో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనున్న సంకేతాలను నివేదిక ఇందుకు ప్రస్తావించింది. -
నిషేధంతో మరింత బిజినెస్: నాస్కామ్
ఐటీ నిపుణులు అత్యధికంగా పొందే H1-Bసహా పలు వీసాలపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడం ద్వారా దేశీ ఐటీ కంపెనీలకు మేలే జరగనున్నట్లు నాస్కామ్ తాజాగా అంచనా వేసింది. దీంతో ఆఫ్‌షోర్ సర్వీసులకు డిమాండ్ పెరగనున్నట్లు సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసుల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. కోవిడ్-19 కారణంగా అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగానికి బ్రేక్ వేసే బాటలో ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ డిసెంబర్ వరకూ పలు వీసాలపై నిషేధం విధించిన విషయం విదితమే. అయితే యూఎస్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత కారణంగా పలు గ్లోబల్ దిగ్గజాలు దేశీ కంపెనీల ద్వారా సర్వీసులను పొందేందుకు ఆసక్తి చూపుతాయని నాస్కామ్ పేర్కొంది. ఇది ఐటీ రంగంలో మరిన్ని ఆఫ్‌షోర్ కాంట్రాక్టులకు దారిచూపుతుందని నాస్కామ్ ఆశిస్తోంది. దిగ్గజాలు రెడీ కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో పలు విదేశీ కంపెనీలు ఆఫ్‌షోర్ సేవలపట్ల ఆసక్తి చూపుతున్నాయని.. దీంతో ఇటీవల దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు బిజినెస్ పెరిగినట్లు నాస్కామ్ పేర్కొంది. ఐటీ రంగంలో కీలక(క్రిటికల్) సర్వీసులకు ఆఫ్‌షోర్ విధానంపై ఆధారపడటం పెరిగిందని తెలియజేసింది. కోవిడ్ సంక్షోభం నుంచి రికవరీ సాధించే బాటలో ప్రతీ దేశం టెక్నాలజీపై మరింత ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని నాస్కామ్ చైర్మన్, ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో ఇది దేశీ ఐటీ పరిశ్రమకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ట్రంప్ H1-B వీసాలపై నిషేధం విధించడంతో ఆఫ్‌షోర్ కాంట్రాక్టులు పెరగనున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఐటీ విశ్లేషకులు అమిత్ చంద్ర తెలియజేశారు. క్యాప్టివ్ సెంటర్స్ సొంత అవసరాల కోసం వినియోగించుకునేందుకు దేశీయంగా ఏర్పాటు చేసే క్యాప్టివ్ సెంటర్స్‌పై విదేశీ దిగ్గజాలు దృష్టి సారించనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు సైతం పెరగనున్నట్లు అంచనా వేస్తున్నాయి. పలు గ్లోబల్ దిగ్గజాలకు దేశీయంగా 1300 క్యాప్టివ్ సెంటర్లున్నట్లు తెలియజేశాయి. వీటి ద్వారా దాదాపు పది లక్షల మంది ఐటీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. ఈ కేంద్రాల నుంచి సర్వీసులను పెంచుకునేందుకు మరింతమంది ఉద్యోగులను తీసుకునే వీలున్నట్లు ఏఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ సీఈవో లలిత్ ఆహుజా చెబుతున్నారు. కోవిడ్ కారణంగా 10-15 శాతం స్థాయిలో ఉద్యోగ కల్పనకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. అంటే 2021కల్లా మొత్తం లక్షమంది వరకూ నైపుణ్యమున్న సిబ్బందిని పెంచుకోవలసి ఉంటుందని వివరించారు. నిజానికి గత కొంతకాలంగా వీసాలను పొందడంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా కొన్ని కంపెనీలు ఆఫ్‌షోర్ సేవలకే ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సాధిస్తున్న ఆదాయంలో ఆన్‌షోర్ వాటాను ఆఫ్‌షోర్ అధిగమిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. -
దేశాధినేతలు, ప్రముఖుల బాగోతం బట్టబయలు!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సన్నిహితులు మొదలు.. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనాల్ మెస్సీ వరకు అనేకమంది ప్రస్తుత, మాజీ దేశాధ్యక్షులు, ప్రముఖుల నల్లడబ్బు బాగోతం బట్టబయలైంది. పన్నులు ఎగ్గొటి.. నల్లడబ్బుకు స్వర్గధామాలైన దేశాల్లో వీరు కోట్లకొద్ది సంపద కూడబెట్టుకున్నట్టు తాజాగా వెల్లడైంది. ప్రపంచంలోనే అతిపెద్ద లీక్‌గా భావిస్తున్న కోటి 15 లక్షల పత్రాలను పరిశీలించడం ద్వారా ఈ వివరాలను వెలుగులోకి వచ్చాయి. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు కన్సార్టియం (ఐసీఐజే) దాదాపు ఏడాదిపాటు ఈ పత్రాలను పరిశీలించి జర్మనీ దినపత్రిక 'సుడియుషె జీతంగ్'లో ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో 140 మంది రాజకీయ నాయకులు పేర్లు ఉండగా, అందులో 12 మంది తాజా, మాజీ దేశాధినేతలు ఉన్నారు. నల్లడబ్బుకు ఆవాసాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,14,000 సంస్థలకు చెందిన కోటి 15 లక్షల పత్రాలు లీకయ్యయాయి. 1975 నుంచి గత ఏడాది చివరివరకు ఉన్న వివరాలు ఇందులో ఉన్నాయని, ఈ పత్రాలను పరిశీలిస్తున్న కొద్దీ గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని ఐసీఐజే పేర్కొంది. లండన్‌లో షరీఫ్ సంపన్న సామ్రాజ్యం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొడుకులు హుస్సైన్, హసన్, కూతురు మరియమ్ సఫ్దర్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో భారీగా కంపెనీలు స్థాపించారు. నల్లడబ్బుతో పెట్టిన ఈ కంపెనీల ద్వారా లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలో భారీ ఆస్తులను షరీఫ్ కుటుంబం వెనుకేసుకుంంది. డుచే బ్యాంకులోనూ, స్కాట్లాండ్లోని బ్యాంకుల్లోనూ ఈ ఆస్తులను తనఖా పెట్టి భారీగా రుణాలు కూడా పొందింది. రెండు బిలియన్ డాలర్లను పోగేసిన పుతిన్! లీకైన ఈ పత్రాల్లో ఎక్కడ కూడా నేరుగా పుతిన్ పేరు కనిపించనప్పటికీ, ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా లబ్ధి పొందిన ఆయన స్నేహితులు భారీగా నల్లడబ్బును విదేశాల్లో పోగేసినట్టు తేలింది. ఆయన సన్నిహితులు ఇలా పోగేసిన డబ్బు ద్వారా వివిధ రూపాల్లో తిరిగి పుతిన్ కుటుంబానికి చేరినట్టు గార్డియన్ పత్రిక జరిపిన పరిశోధనలో వెల్లడైంది. పుతిన్, ఆయన సన్నిహితులు ఏకంగా 2 బిలియన్ డాలర్లు (రూ. 13,269 కోట్లు) పోగేసినట్టు తెలుస్తున్నదని ఆ పత్రిక తెలిపింది. అంతేకాకుండా చైనా ప్రధాని గ్జి జింగ్పింగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ, చైనా యాక్షన్ స్టార్ జాకీ చాన్.. చాలామంది నేతలు, ప్రముఖులు పన్ను ఎగ్గొట్టి అక్రమంగా విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బు వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయని జర్మనీ పత్రిక పేర్కొంది. పాత్రికేయ ప్రపంచానికి సంబంధించినంత వరకు ఇది అతిపెద్ద లీక్ అని అమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడన్ ట్వీట్ చేశారు. Biggest leak in the history of data journalism just went live, and it's about corruption. https://t.co/dYNjD6eIeZ pic.twitter.com/638aIu8oSU — Edward Snowden (@Snowden) 3 April 2016