Today News Rondup
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:45 AM 28 June 2023
-
టాప్ 60 న్యూస్ @ 6:45 AM 11 December 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @6:00 Pm 29 నవంబర్ 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @5:30 PM 12 నవంబర్ 2022
-
టాప్ 25 న్యూస్ @ 7:00 AM 22 October 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @6:00Pm 12 అక్టోబర్ 2022
-
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. అనంతను ముంచెత్తిన వాన ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆ ప్యాకేజీకి ఓకే అంటే మునుగోడు నుంచి తప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీకి బంపరాఫర్ ప్రకటించారు. మునుగోడు బరి నుంచి తప్పుకునేందుకు ప్యాకేజీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారాయన. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ. 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు కదా అంటూ తీవ్ర విమర్శలే గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. డెమొక్రటిక్ పార్టీకి తుల్సీ గబ్బార్డ్ గుడ్‌బై 20 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు తుల్సీ గబ్బార్డ్. అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు అయిన గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. యూరప్‌లోనూ యూపీఐ చెల్లింపులు యూరప్‌కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్‌కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్‌లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు! భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ దురాక్రమణ అంశంపై అసలు చర్చించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయితే ఆ వ్యవహారంపై మాత్రం పుతిన్‌తో అవకాశం ఉంటే చర్చిస్తానని తెలిపారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాలీవుడ్ ఎంట్రీ.. పాన్ ఇండియా లెవల్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టీ20 వరల్డ్‌కప్.. టీమిండియాకు బలం టి20 ప్రపంచకప్ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్‌న్యూస్. టీమిండియా ఫ్రంట్‌లైన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో షమీకి ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్‌కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మానవహక్కుల దూత అశ్విని, తొలి దళిత యువతిగా.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టాప్ హెడ్‌లైన్స్ @6Pm 04 October 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @4:30PM 2 October 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @7:30 Pm 29 September 2022
-
టాప్ 25 న్యూస్ @ 7AM 26 September 2022
-
బిగ్ క్వశ్చన్ : జగన్ పర్యటనతో మారిన కుప్పం సీన్
-
టాప్ హెడ్‌లైన్స్ @6:00 PM 23 September 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @3 PM 22 September 2022
-
టాప్ హెడ్‌లైన్స్ @6PM 21 September 2022
-
గన్ షాట్ : అప్పుల కుప్ప వయ్యారి బాబు
-
ఖమ్మం జిల్లాలో బలంగా తయారైన కాంగ్రెస్
-
మార్నింగ్ టాప్-10 న్యూస్ రౌండప్
1. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు, కారణం ఏంటంటే.. రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు జరిగాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కాకుండా మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌజ్‌లో జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంతేకాదు.. ప్రభాస్ కాకుండా అతని సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. వైఎస్ఆర్ కల్యాణమస్తూ.. బాలికల విద్యకూ ప్రోత్సాహాం పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. జ్ఞానవాపి తీర్పు.. వారణాసిలో 144 సెక్షన్ ఉత్తర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. నానమ్మ మరణంతో యువరాజుల ఐక్యత! రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. మరోవైపు.. విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. యూఎస్ ఓపెన్‌లో 19 ఏళ్ల కుర్రాడి సంచలనం యూఎస్ ఓపెన్‌లో స్పానిష్ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. పాక్‌లో వరద బాధితులను... అక్కున చేర్చుకున్న ఆలయం కనీవిని ఎరగని వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్లో ఓ చిన్న గ్రామంలోని హిందూ దేవాలయం అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జలాల్ ఖాన్ అనే మారుమూల కుగ్రామంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరదలో సర్వం కోల్పోయిన కనీసం 300 మంది ముస్లింలకు ఆశ్రయంతో పాటు భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు ‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్ నుంచి మద్రాస్ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్‌కి తిరిగొచ్చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. ఆ హిమానీనదం.. కరిగితే ప్రళయమే! థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఉగ్రగోదావరి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితిని సమీకక్షించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టాప్ 60 న్యూస్ @ 6:30 AM 10 September 2022
-
టాప్ 25 న్యూస్ @ 1PM 26 July 2022
-
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి(బుధవారం, జూన్ 1వతేదీ) నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. సీఎం జగన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృతజ్ఞతలు దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3.జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టిన కేకే ప్రేమ గీతాల కంటే విరహ గీతాల్లోనే ఓ భావోద్వేగం ఉంటుంది. కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. అలాంటి విషాద విరహ గీతాలతోనే ఎక్కువగా సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు ఆయన.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.తెలంగాణలో నేడు కాంగ్రెస్ చింతన్ శిబిర్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మేధోమథనం జరగనుంది. ‘నవ సంకల్ప శిబిర్’ పేరిట మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని బాల వికాస్ ప్రాంగణంలో బుధ, గురువారాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ యుద్ధం.. అమెరికా కీలక సాయం రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు కీలక సాయం అందించేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. సుదీర్ఘ నిర్ణీత లక్ష్యాలను నాశనం చేసే అత్యాధునిక రాకెట్ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. కానీ.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. గ్రూప్–1 దరఖాస్తుల గడువు పొడిగింపు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాజాగా గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు గడువు పొడిగించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. అయ్యో.. గుండెను గాబరా పెట్టకండి రాష్ట్రంలో 2020లో అత్యధిక మరణాలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్లే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో కరోనా వైరస్ సంబంధిత మరణాలు ఉన్నట్టు వెల్లడైంది. రిజిస్ట్రార్ జనరల్, సైన్సెస్ కమిషనర్ ఇటీవల ‘రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్ 2020’ నివేదికను వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. బీజేపీ ‘పటీదార్ పవర్’.. వర్కవుట్ అయ్యేనా? హార్దిక్ పటేల్. ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పటీదార్ నాయకుడు. పటీదార్లను ఓబీసీలుగా గుర్తించాలంటూ కమళదళంపై గళమెత్తిన నేత. ఇప్పుడు ఆ పార్టీ విధానాలకే జై కొడుతున్నారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన, ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. ట్విటర్ డీల్‌తో టెస్లాకు భారీ దెబ్బ ట్విటర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయడం తెలిసిందే. అయితే ఆయన సీఈవోగా ఉన్న టెస్లాకు ఈ ప్రభావంతో భారీ దెబ్బ పడింది. 2. మూడు వేలకు చేరువలో కరోనా కేసులు దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. 3. పుతిన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదే పదే అణ్వాయుధం అనే పదం వాడుతుండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే తిట్టిపోశాడు. 4.ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా రియాన్ పరాగ్.. రియాన్ పరాగ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు నాలుగు క్యాచ్‌లు తీసుకున్న మూడో ప్లేయర్‌గా పరాగ్ నిలిచాడు. గతంలో కలిస్ (కోల్‌కతా నైట్‌రైడర్స్; డెక్కన్ చార్జర్స్‌పై 2011లో), గిల్‌క్రిస్ట్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్; చెన్నై సూపర్ కింగ్స్‌పై 2012లో) ఈ ఘనత సాధించారు. 5. చైనాలో మరో వైరస్.. ప్రపంచంలోనే ఫస్ట్ కేసు కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ చైనాను మరో వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. 6. ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 7. నిర్మాతతో పెళ్లి, వ్యభిచారం ఒత్తిడితో నటి ఆత్మహత్యాయత్నం గుడిలో నిర్మాతతో పెళ్లి చేసుకున్న కోలీవుడ్ సీరియల్ నటి.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి తేవడంతో నటి ఆత్మహత్యాయత్నం 8. తమిళనాడు తంజావూరులో పెనువిషాదం తంజావూరు రథయాత్రలో మంగళవారం అర్ధరాత్రి దాటాక అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్రకు కరెంట్ వైర్లు తగలడంతో.. కరెంట్ షాక్‌తో మంటలు చెలరేగి పది మందికిపైగా భక్తుల దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 9. తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? వేసవిలో మాత్రమే కనిపించే సీజనల్ ఫుడ్ తాటి ముంజలు. ఇవి చూసేందుకు చిన్నవైనా పోషకాల్లో మెండు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే దివ్య ఔషధం. ప్రకృతి వరప్రసాదంగా మారి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి తాటి ముంజల గురించి ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 10. ఆసియా క్రీడల్లో ఆడలేమన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పోటీతత్వం మరింత మెరుగు పడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఆహ్వానించింది. కానీ, అవి పాల్గొనమని చెప్పేశాయి. -
టాప్ 60 న్యూస్ @ 6AM 15 April 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 09 April 2022
-
సాక్షి నేషనల్ న్యూస్@ 2st April 2022