1. తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి(బుధవారం, జూన్ 1వతేదీ) నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. సీఎం జగన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృతజ్ఞతలు
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3.జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించాడు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టిన కేకే
ప్రేమ గీతాల కంటే విరహ గీతాల్లోనే ఓ భావోద్వేగం ఉంటుంది. కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. అలాంటి విషాద విరహ గీతాలతోనే ఎక్కువగా సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు ఆయన..
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5.తెలంగాణలో నేడు కాంగ్రెస్ చింతన్ శిబిర్
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మేధోమథనం జరగనుంది. ‘నవ సంకల్ప శిబిర్’ పేరిట మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని బాల వికాస్ ప్రాంగణంలో బుధ, గురువారాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. ఉక్రెయిన్ యుద్ధం.. అమెరికా కీలక సాయం
రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు కీలక సాయం అందించేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. సుదీర్ఘ నిర్ణీత లక్ష్యాలను నాశనం చేసే అత్యాధునిక రాకెట్ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. కానీ..
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం
రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో..
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. గ్రూప్–1 దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాజాగా గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు గడువు పొడిగించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. అయ్యో.. గుండెను గాబరా పెట్టకండి
రాష్ట్రంలో 2020లో అత్యధిక మరణాలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్లే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో కరోనా వైరస్ సంబంధిత మరణాలు ఉన్నట్టు వెల్లడైంది. రిజిస్ట్రార్ జనరల్, సైన్సెస్ కమిషనర్ ఇటీవల ‘రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్ 2020’ నివేదికను వెల్లడించింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. బీజేపీ ‘పటీదార్ పవర్’.. వర్కవుట్ అయ్యేనా?
హార్దిక్ పటేల్. ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పటీదార్ నాయకుడు. పటీదార్లను ఓబీసీలుగా గుర్తించాలంటూ కమళదళంపై గళమెత్తిన నేత. ఇప్పుడు ఆ పార్టీ విధానాలకే జై కొడుతున్నారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన, ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment