1. అనంతను ముంచెత్తిన వాన
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. ఆ ప్యాకేజీకి ఓకే అంటే మునుగోడు నుంచి తప్పుకుంటాం
తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీకి బంపరాఫర్ ప్రకటించారు. మునుగోడు బరి నుంచి తప్పుకునేందుకు ప్యాకేజీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారాయన. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ. 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు కదా అంటూ తీవ్ర విమర్శలే గుప్పించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. డెమొక్రటిక్ పార్టీకి తుల్సీ గబ్బార్డ్ గుడ్‌బై
20 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు తుల్సీ గబ్బార్డ్. అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు అయిన గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. యూరప్‌లోనూ యూపీఐ చెల్లింపులు
యూరప్‌కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్) యూరప్‌కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్‌లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్‌ఐపీఎల్ ప్రకటించింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు!
భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ దురాక్రమణ అంశంపై అసలు చర్చించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయితే ఆ వ్యవహారంపై మాత్రం పుతిన్‌తో అవకాశం ఉంటే చర్చిస్తానని తెలిపారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే..
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. మాలీవుడ్ ఎంట్రీ.. పాన్ ఇండియా లెవల్
తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. టీ20 వరల్డ్‌కప్.. టీమిండియాకు బలం
టి20 ప్రపంచకప్ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్‌న్యూస్. టీమిండియా ఫ్రంట్‌లైన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో షమీకి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించారు. ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్‌కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. మానవహక్కుల దూత అశ్విని, తొలి దళిత యువతిగా..
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment