
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తున్నందకు ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ 15 ఏళ్ల చరిత్రలో ఇంత అబద్ధాలు చెప్పే అధికారులను చూడలేదని అసహనం వ్యక్తం చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సభ్యుడైన తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి చెందాడు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోని క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment