రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. అనేక పరిణామాల మధ్య దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. మరోవైపు సొంత నియోజకవర్గంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ పలు దేశాలకు విస్తరించినట్టు వార్తలు వెలువడుతుండగా, భారత్‌లో తొలి కేసు నమోదైంది. కేరళకు చెందిన ఒక విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment