ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు | Today News Roundup 10Th July 2018 | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు

Published Tue, Jul 10 2018 6:31 PM | Last Updated on Tue, Jul 10 2018 6:47 PM

Today News Roundup 10Th July 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయం చోటుచేసుకుంది. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్‌-377పై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకే మొగ్గు చూపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం వినతిని ధర్మాసనం సున్నితంగా తోసిపుచ్చింది.  దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

సెక్షన్‌-377.. కేంద్రానికి ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: సెక్షన్‌-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున అదనపు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు.

నీట్‌ 2018 : మద్రాస్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

లైంగిక దాడులతో రామ రాజ్యం ఎలా తెస్తారు..?
సాక్షి, ముంబై : శ్రీరాముడు దిగివచ్చినా దేశంలో లైంగిక దాడులను ఆపలేడని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీజేపీపై శివసేన విరుచుకుపడింది.

ఆ హిట్‌ లిస్ట్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌
ఇస్లామాబాద్‌ : మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ- ఇన్సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ సహా పలువురు ప్రముఖులపై జులై 25న జరగనున్న పాక్‌ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో

జమిలి ఎన్నికలకు సై : వైఎస్సార్‌ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలను(జమిలి ఎన్నికలు) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్ధిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు.

‘వైఎస్సార్‌ సీపీ ప్రొడక్ట్స్‌పై టీడీపీ మమకారం’
సాక్షి, కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌

చంద్రబాబుని రాజకీయంగా బొందపెట్టాలి
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు తిరుపతి వెళ్లనున్నారు.

బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం
సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

 పెళ్లికి పీఎఫ్‌ మనీ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) తన సభ్యులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది.

ఆ పేరంటే నాకు చాలా ఇష్టం: రోహిత్‌
బ్రిస్టల్‌: భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మను సహచర ఆటగాళ్లు, అభిమానులు 'హిట్‌ మ్యాన్‌' అని ముద్దుగా పిలుచుకుంటారు.

బెయిల్‌పై వచ్చాడు.. పెళ్లి చేసుకున్నాడు
అర్థాంతరంగా పీటల మీదే ఆగిపోయిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ వివాహం మంగళవారం ఊటిలో జరిగింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement