ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికపై అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ రెండో భేటీ ముగిసింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కార్యరూపం దాల్చాలంటూ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ హింసపై కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కీలక అంశాలను ఢిల్లీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఇకపోతే, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Published Fri, Jan 10 2020 7:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement