భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. మరోవైపు, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. ఇదిలా ఉండగా, రానున్న డిజిటల్ యుగంలో దూసుకుపోయేందుకు దేశంలోని వ్యాపారవేత్తలు తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల అన్నారు.