వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణ, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో పలు జాతీయ సంస్థలతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. మరోవైపు ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది.