
పోలవరం ప్రాజెక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మరోవైపు జలమండలి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం సందర్శించారు. విద్యార్థులు, ప్రజల్లో వాటర్ హార్వెస్టింగ్‌పై చైతన్యం కలిగించేలా థీమ్ పార్క్‌ను జలమండలి రూపొందించింది. ఇక, నిర్భయ హత్యాచార ఘటనలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా (25) సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇదిలా ఉండగా, ‘కరోనా’ దెబ్బకు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అత్యంత భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం చోటు చేసుకున్న మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.