
ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించామని, శాంతి..సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక, దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. మరోవైపు, విద్యుత్ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామన్నారు. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment